ప్రియుడి మోజులో కన్న కొడుకును హతమార్చిన తల్లి.. సిద్దిపేటలో సంచలనం

ప్రియుడి మోజులో కన్న కొడుకును హతమార్చిన తల్లి.. సిద్దిపేటలో సంచలనం

సిద్దిపేట జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో రెండేళ్ల చిన్నారిని హత్య చేసిన కేసులో తల్లి జ్యోతి, ఆమె ప్రియుడు నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల వివరాల ప్రకారం, సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన జ్యోతి, స్వామి దంపతులు కీసర ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న స్వామి విధులకు వెళ్లిన సమయంలో జ్యోతి ప్రియుడు నవీన్ తరచూ ఇంటికి వచ్చేవాడని విచారణలో తేలింది.

ఫ్యాటీ లివర్ నుంచి రక్షణలో కాఫీ పాత్ర.. పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?

మే 29న స్వామి పనికి వెళ్లిన అనంతరం నవీన్ జ్యోతి ఇంటికి వచ్చాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెండేళ్ల బాలుడు ఏడవడంతో, అతడు తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన నవీన్ చిన్నారిని చంపాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు. జ్యోతి కూడా అందుకు అంగీకరించడంతో ఇద్దరూ కలిసి బాలుడిపై దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది.

తలకు తీవ్ర గాయాలు కావడంతో బాలుడు మృతి చెందాడు. అనంతరం ఫిట్స్ రావడంతో చిన్నారి చనిపోయాడని భర్తను, కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే చిన్నారి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి స్వామి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

బొకేలు, శాలువాలకు బదులు విద్యార్థులకు సాయం చేయండి.. సీఎం విజయ్ కొత్త సందేశం

కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు, కాల్ డేటా రికార్డులు సేకరించి దర్యాప్తు చేపట్టారు. విచారణలో జ్యోతి, నవీన్‌ల మధ్య పెళ్లికి ముందునుంచే సంబంధం ఉన్నట్లు గుర్తించారు. బాలుడు తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతోనే హత్య చేసినట్లు ఇద్దరూ ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు.

మృతదేహాన్ని వెలికితీసి వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. చిన్నారి హత్య కేసును పోలీసులు అత్యంత ప్రాధాన్యతతో విచారిస్తున్నారు.

మలబద్ధకం చిన్న సమస్య కాదు.. గట్ హెల్త్ బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్న తల్లే తన బిడ్డ ప్రాణాలు తీయడం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

లివర్ ని శుభ్రం చేసే పవర్ ఫుల్ డ్రింక్.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *