భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో బీహార్ కీలక రాష్ట్రం. ఢిల్లీ–హౌరా, ఢిల్లీ–ఈశాన్య భారత మార్గాల్లో నడిచే అనేక రైళ్లు ఈ రాష్ట్రం గుండా ప్రయాణిస్తాయి. రోజూ వందలాది ప్రయాణికుల రైళ్లు బీహార్‌లోని వివిధ స్టేషన్లలో ఆగుతుంటాయి. అయితే బీహార్ గుండా ప్రయాణిస్తూ కూడా అక్కడి ఏ స్టేషన్‌లోనూ ఆగని ఒక ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ రైలు ఉంది.
ఆ రైలు ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్. ఇది ఆనంద్ విహార్ టెర్మినల్ (ఢిల్లీ) – భువనేశ్వర్ మధ్య 12819/12820 నంబర్లతో నడుస్తుంది. సుమారు 1,782 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 28 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేసే ఈ రైలు మొత్తం ప్రయాణంలో పరిమిత స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.
Related News: 40 ఏళ్లు దాటాక ఈ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి.. ముందస్తు జాగ్రత్తలే ప్రాణ రక్షణ
ఈ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి బయలుదేరి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా ఒడిశాకు చేరుకుంటుంది. ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ సెంట్రల్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ వంటి ముఖ్య స్టేషన్లలో ఆగిన తర్వాత బీహార్‌లోకి ప్రవేశిస్తుంది.
బీహార్‌లో ససారం, గయా, మాన్‌పూర్, ఇతర ప్రధాన రైల్వే స్టేషన్ల గుండా ప్రయాణించినప్పటికీ అక్కడ ఎక్కడా హాల్ట్ ఇవ్వదు. అనంతరం జార్ఖండ్‌లోని గోమో జంక్షన్, టాటానగర్ వంటి స్టేషన్లలో ఆగి, పశ్చిమ బెంగాల్ మీదుగా భువనేశ్వర్‌కు చేరుకుంటుంది.
Related News: 2,000 పాములను కాపాడిన ‘స్నేక్ ఫ్రెండ్’కు నాగుపాము కాటు.. ప్రాణాపాయ స్థితిలో చికిత్స.
ఈ రైలు బీహార్‌లో ఆగకపోవడానికి ప్రత్యేక కారణం ఉంది. సంపర్క్ క్రాంతి రైళ్లు ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీని ఆయా రాష్ట్రాల రాజధానులతో వేగంగా అనుసంధానించేందుకు ప్రవేశపెట్టిన సేవలు. అందువల్ల మధ్యలో అవసరమైన కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లలో మాత్రమే హాల్ట్ ఇస్తాయి. ఈ కారణంగానే ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ బీహార్ రాష్ట్రం గుండా ప్రయాణించినప్పటికీ అక్కడి ఏ స్టేషన్‌లోనూ సాధారణంగా ఆగదు.