
Kannappa Movie: కన్నప్ప సినిమా ద్వారా హీరో మంచు విష్ణు(Manchu Vishnu) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో.. కన్నప్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను శర వేగంగా నిర్వహిస్తున్నారు. సినిమా షూటింగ్ సమయంలో సరదా సంఘటనలకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు మోహన్‌బాబు.
ఈ చిత్రం ఎక్కువ భాగం న్యూజిలాండ్ (New Zealand) లోనే షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. మూవీ బృందం దాదాపు కొన్ని నెలల పాటు న్యూజిలాండ్ లో ఉంటూ అక్కడే కన్నప్ప సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని భారతదేశానికి వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా న్యూజిలాండ్ లో చిత్ర బృందం సరదాగా గడిపిన ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
అయితే ఓ సువిశాల మైదానంలో నిల్చుని ఇదంతా నాది, విష్ణుదే అని అంటున్నాడు.. ఇక ఈ వీడియో తీస్తున్న బ్రహ్మాజీ.. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లు వింటున్నారుగా.. మొత్తం బ్లాక్‌మనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని సరదాగా అంటాడు. దాంతో మోహన్‌బాబు.. మా దగ్గర బ్లాక్‌మనీయే లేదు. న్యూజిలాండ్‌లోని వనాకాలో ఓ ఇల్లు, 7000 ఎకరాలు కొన్నాం. ఇదంతా మనదే అని జోక్ చేస్తారు. ఇంతలో ప్రభుదేవా అక్కడికి రావడంతో ప్రభుదేవాతో కలిసి ఏడు వేల ఎకరాలు కొన్నట్లు మాట మారుస్తాడు.మోహన్ బాబు సీరియస్ గా చెప్పారా? లేదంటే సరదాగా ఇలా చెప్పారా? అనేది తెలియదు కానీ మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.