తెలుగులో అందరూ ఆదరించిన పాపులర్ కామెడీ షో జబర్దస్త్ అని అందరికీ తెలిసిన విషయమే. జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులరో దానిలో నటించిన కమెడియన్స్ కూడా అంతే పాపులర్. అయితే జబర్దస్త్ కామెడీ షో లో నటించిన ఒక కమెడియన్ రాకింగ్ రాకేష్ నిర్మించిన కెసిఆర్ (కేశవ చంద్ర రమావత్) సినిమా రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో ఈ సినిమా తీశాను అని చెప్తున్నా రాకింగ్ రాకేష్.ఈ సినిమాలో కథ ఏంటో తెలుసుకుందాం.
కథ:
కథ విషయానికొస్తే హీరో కెసిఆర్ (కేశవ చంద్ర రమావత్) కి చిన్నప్పటినుండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అభిమానం. ఈ విషయం ఆ ఊరి ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇతడిని చోటా కెసిఆర్ అని పిలిచేవారు. ఈ మూవీలో కేశవ చందా రమావత్ ని తన మరదల్ అయిన మంజు చిన్నప్పటినుండి ప్రేమిస్తుంది. కానీ కేశవ చంద్ర రమా వత్ వేరొక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు.
ఆయన వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని తీసుకొస్తా అని అని చెప్పి ఇంటి నుండి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటాడు. అయితే అన్నమాట ప్రకారం వాళ్ళ ఊరికి కేసీఆర్ ని తీసుకొచ్చాడా లేదా అనేది కథ. కేశవ చంద్ర రమావత్ కెసిఆర్ మూవీలో రాకింగ్ రాకేష్ హీరోగా అనన్య కృష్ణన్ నటించారు. హీరో కేశవ చంద్ర రమావత్ అన్నమాట ప్రకారం హైదరాబాద్ వచ్చి కెసిఆర్ ని పెళ్లికి తీసుకురావడానికి ఎన్నో పాట్లు పడతాడు. హీరోయిన్ తండ్రిగా మైమ్ మధు సూపర్ గా చేశాడు.
ఈ మూవీలో కొన్ని డైలాగ్స్ అదరగొట్టేశారు వాటిల్లో ఒకటి ఊరిని వదిలి పెట్టే మనుషులు ఉంటారు కానీ మనుషులను వదిలిపెట్టే ఊరు ఉండదు అని డైలాగ్ అద్భుతంగా ఉంది. కొంచెం సమయం పాటు జోర్దార్ సుజాత, తాగుబోతు రమేష్ పాత్రలు కనిపించి ప్రేక్షకులను నవ్వుల పూలు పూయిస్తారు. మొత్తానికి ఒక పాపులర్ షో కమెడియన్గా తెరమీదకి వచ్చి నిర్మాతగా మరియు హీరోగా బాగా కనిపించాడు రాకింగ్ రాకేష్. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మూవీ చూసేయండి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb