
బెంగళూరు, బనశంకరి:
బెంగళూరులో మరో భవనం కూలిపోవడానికి ముందే అధికారులు చర్యలు చేపట్టారు. కోరమంగల జక్కసంద్ర ప్రాంతంలో నియమావళిని ఉల్లంఘించి నిర్మించిన ఐదు అంతస్తుల భవనం ప్రమాదకర స్థితికి చేరుకుంది.
ఒకే ఒక్కసారి ఇది చేయండి చాలు! పొట్ట పేగులు క్లీన్.
మూడు అంతస్తులకే అనుమతి – ఐదు అంతస్తులు నిర్మాణం
శాంతమ్మ అనే మహిళ సంవత్సరం క్రితం బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) నుండి మూడు అంతస్తుల భవనానికి అనుమతి పొందింది. అయితే ఆమె 15 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు గల చిన్న స్థలంలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించింది. దాదాపు రూ. కోటి వ్యయంతో ఈ భవనాన్ని పూర్తి చేసి, వచ్చే వారం గృహప్రవేశం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్..
పగుళ్లు – వాలిపోయిన నిర్మాణం
ఇప్పటికే భవనంలో పిల్లర్లు, గోడల్లో తీవ్ర పగుళ్లు ఏర్పడగా, భవనం ఒక వైపుకు వాలిపోయింది. దీనితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడైనా కూలిపోవచ్చని ప్రమాద సూచనలతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పాలికె కూల్చివేత నిర్ణయం
పరిశీలన అనంతరం భవనం ప్రమాదకరమని నిర్ధారించిన అధికారులు, కూల్చివేయాలని నిర్ణయించారు. గత రెండు రోజులుగా కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు చుట్టుపక్కల నివాసులను ఖాళీ చేయించారు.
ఖర్చు యజమానిపైనే
కూల్చివేతకు సంబంధించిన మొత్తం ఖర్చును భవన యజమానియే భరించాలని బృహత్ బెంగళూరు మహానగర పాలికె స్పష్టం చేసింది.అనుమతిని మించి నిర్మాణం చేపట్టడం, నియమాలను విస్మరించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మళ్లీ రుజువు చేసింది. భవన నిర్మాణంలో నియమాలను పాటించడం తప్పనిసరి అని అధికారులు హెచ్చరించారు.