ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయి అని వాతావరణ శాఖ తెలియజేసింది. బంగాళాఖాతంలో తుపాను కారణంగా కోస్తా ప్రాంతంలో మోస్తారు నుండి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ఈ అల్పపీడనాన్ని అంచనా వేయడం కష్టమౌతోంది. వాయుగుండం నుంచి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినా మరోసారి బలపడే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరంవైపుకు కదులుతోంది. చలిగాలులు, వాతావరణం ప్రకారం మరోసారి బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. తుపానుగా మారే అవకాశాలు కూడా ఉండవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కోస్తా జిల్లాలో చాలా ప్రాంతాలలో ముసురు పట్టి అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కూడా పదనున్నాయి అని వాతావరణ శాఖ తెలియజేసింది.
అయితే ముఖ్యంగా ఈ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు పడతాయిని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. శ్రీకాకుళం,అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ,అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం…
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భారీ వర్షాలుండే ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb