ROHIT SHARMA: క్రీడా రంగంలో రోహిత్ శర్మకు పద్మశ్రీ.

ROHIT SHARMA: క్రీడా రంగంలో రోహిత్ శర్మకు పద్మశ్రీ.

ROHIT SHARMA: క్రీడా రంగంలో రోహిత్ శర్మకు పద్మశ్రీ.

కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు పద్మ విభూషణ, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఈసారి మొత్తం ఐదుగురికి పద్మ విభూషణ, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. దివంగత నటుడు ధర్మేంద్రకు పద్మ విభూషణ, నటుడు మమ్ముట్టి, దివంగత సిబ్బు సోర్యలకు పద్మభూషణ్ అవార్డులు ప్రకటించడం విశేషం.

అమెరికాలో భారతీయుడి గొప్ప మనసు: నిరుపేద జంట ఆకలి తీర్చి నెటిజన్ల మనసు గెలుచుకున్న నోవా.

తెలుగు రాష్ట్రాలకు ఈసారి పెద్ద ఎత్తున పద్మ పురస్కారాలు లభించాయి. తెలంగాణ నుంచి ఏడుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు చొప్పున మొత్తం 11 మందికి పద్మ అవార్డులు వరించాయి. నటుడు కిరీటి రాజేంద్ర ప్రసాద్, నటుడు మురళీమోహన్‌కు పద్మశ్రీ అవార్డులు లభించాయి. అలాగే క్రికెటర్లు రోహిత్ శర్మ(ROHIT SHARMA), హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కూడా పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.

Obesity: కొంతమంది ఎంత తిన్నా లావు అవ్వకపోవడానికి కారణం ఇదే.

తెలంగాణకు చెందిన అవార్డు గ్రహీతల విషయానికి వస్తే, వైద్యరంగంలో 35 ఏళ్లకు పైగా సేవలందించిన డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డికి పద్మశ్రీ లభించింది. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో గడ్డమానూరు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం పద్మశ్రీలకు ఎంపికయ్యారు.

ROHIT SHARMA

కళారంగంలో దాదాపు 25 సంవత్సరాలుగా సేవలందిస్తున్న దీపికా రెడ్డికి ఈ గౌరవం దక్కింది. పశుసంవర్ధక రంగంలో విశేష కృషి చేసిన మామిడి రమారెడ్డికి కూడా పద్మశ్రీ ప్రకటించారు. జన్యు సంబంధ పరిశోధనల్లో కీలక పాత్ర పోషించిన సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి సంగరాజుకు పద్మశ్రీ లభించింది.

చెల్లెమ్మ అంటూనే వంచన.. ఖమ్మం ప్రమీల ఘటనపై సంచలన నిజాలు!

దేశవ్యాప్తంగా 43 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించగా, అందులో 11 మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం విశేషం. ఈ అవార్డులు తమ జీవితంలో అత్యున్నత గౌరవంగా భావిస్తున్నామని అవార్డు గ్రహీతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు(ROHIT SHARMA). త్వరలో రాష్ట్రపతి చేతుల మీదగా ఢిల్లీలోని పరేడ్ గ్రౌండ్‌లో వీరందరికీ అధికారికంగా పద్మ పురస్కారాలు అందజేయనున్నారు.

షుగర్ ఉన్నవారు అన్నం తినాలా? ఏ ధాన్యాలు సురక్షితం – గ్లైసెమిక్ ఇండెక్స్ ఆధారంగా పూర్తి అవగాహన.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *