సోషల్ మీడియా ద్వారా ఏర్పడుతున్న పరిచయాలు కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసం చేసిన రాహుల్ అనే యువకుడు, విజయవాడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
ఇదే సమయంలో మంగళగిరి ప్రాంతంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో పిల్లల స్మార్ట్‌ఫోన్ వినియోగం, సోషల్ మీడియా ఖాతాలపై తల్లిదండ్రులు జాగ్రత్తగా నిఘా పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!
పోలీసుల వివరాల ప్రకారం..
మంగళగిరి పరిధిలో నలుగురు యువకులు మాయమాటలు చెప్పి బాలికను నమ్మించారు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. జరిగిన విషయం ఎవరికైనా చెబితే ప్రాణహాని కలిగిస్తామని నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారు.
పురుషుల్లో టెస్టోస్టిరోన్ తగ్గుదలకి నేచురల్ పరిష్కారం – అత్తిపత్తి వేళ్ల పొడి ప్రయోజనాలు.
భయంతో బాధితురాలు ఈ విషయాన్ని బయటపెట్టకుండా మౌనంగా ఉండిపోయింది. అయితే బాలిక ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా సమాజమంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.