నారాయణపేట జిల్లాలో కోటి విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.

నారాయణపేట జిల్లాలో కోటి విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.

సమాచారం మేరకు అగ్రికల్చర్ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, పోలీస్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ రేడ్‌లో స్పూరియస్ సీడ్స్ (Spurious Seeds) కు చెందిన HT కాటన్ (Herbicide Tolerant Cotton) విత్తనాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. సుమారు 10 టన్నులు, అంచనా విలువ రూ.1 కోటి మేర అక్రమ కాటన్ విత్తనాలను అధికారులు సీజ్ చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా వి. బాలకృష్ణ నాయుడు, యశువర్ధన్ నాయుడులను గుర్తించారు. వీరు కొత్తపల్లి మండలం, బోనేడు గ్రామంకు చెందినవారు. గతంలో కూడా వీరిపై మూడు కేసులు నమోదై ఉన్నాయి. గత 2–3 సంవత్సరాలుగా కర్ణాటక నుంచి అక్రమంగా ఈ విత్తనాలను తెచ్చి, బార్డర్ జిల్లా కావడంతో స్థానిక రైతులకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

స్పూరియస్ సీడ్స్ తెలంగాణ రాష్ట్రంలో నేరం కావడంతో, మద్దూర్ మరియు నారాయణపేట రూరల్ పోలీస్ లిమిట్స్ పరిధిలో రెండు కేసులు నమోదు చేశారు. నిందితులపై సెక్షన్ 19 – సీడ్స్ యాక్ట్, సెక్షన్ 15 – ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, సీడ్ కంట్రోల్ ఆర్డర్, అలాగే IPC సెక్షన్ 318 (BNS) కింద కేసులు నమోదు చేశారు. పాత కేసులు ప్రస్తుతం కోర్టుల్లో విచారణలో ఉన్నాయి.

బార్డర్ జిల్లా కావడంతో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అక్రమ విత్తనాల రవాణాపై రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే అగ్రికల్చర్ అధికారులకు లేదా పోలీస్ శాఖకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ మొత్తం ఆపరేషన్‌ను ఎస్‌డీపీఓ లింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ, ఇద్దరు ఏఐలు, నారాయణపేట టౌన్, మద్దూర్, రూరల్ సర్కిల్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులందరినీ ఉన్నతాధికారులు అభినందించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *