కర్నూలులో జరిగిన భయానక బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, కొంతమంది మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటపడి ప్రాణాలను రక్షించుకున్నారు. ఆ బాధితుల్లో ఒకరు — రామారెడ్డి. ప్రస్తుతం ఆయన బతికి బయటపడ్డ ఆ భయానక క్షణాలను ప్రత్యక్షంగా వివరించారు.
రామారెడ్డి మాట్లాడుతూ —
“ప్రమాదం జరిగినప్పుడు నేను పడుకున్నాను. అకస్మాత్తుగా వెనుక డోర్ దగ్గర గుద్దుడు గుద్దుడు శబ్దాలు వినిపించాయి. ఏమైందో అని లేచి చూడగా మొత్తం బస్సు లోపల పొగతో నిండిపోయింది. ఎవరు ఎక్కడ ఉన్నారో కనిపించలేదు. కేకలు, అరుపులు వినిపించాయి. అప్పుడు ఒక్కసారిగా ఎవరో నా చెయ్యి, కాలు పట్టుకుని లాగేశారు. నేనో విధంగా బయటపడ్డాను. నేల మీద పడగానే నా వెనుక ఇంకొకరు పడిపోయారు.”
ఈ చిన్న పనితో బ్రెయిన్ రిఫ్రెష్… బాడీలో ఫ్యాట్ దూరం.
ఆయన చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు –
“రెండు నిమిషాల లోపే బస్సు మొత్తం మంటల్లో కాలి పేలిపోసాగింది. చుట్టూ అల్లకల్లోల పరిస్థితి. వర్షం, రక్తం, ట్రాఫిక్ జామ్… అంతా కలగలిపి ఉన్నారు. ఎవరో మంచివాళ్లు వచ్చి మమ్మల్ని ఎత్తుకుని కారు లో హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్లు ఎవరో కూడా నాకు తెలియదు కానీ, నాకు పునర్జన్మ ఇచ్చినవాళ్లు వాళ్లే.”
రామారెడ్డి చెబుతున్నదాని ప్రకారం –
ఆయన కూకట్పల్లి నుంచి రాత్రి 9 గంటల సమయంలో బస్సు ఎక్కారు. అసలు వెళ్లాల్సిన బస్సు నెంబర్ వేరేగా ఉండగా, వారికి వేరే బస్సులో కూర్చోమన్నారు. వై జంక్షన్ దగ్గర వారిని కావేరి ట్రావెల్స్ బస్సులోకి మార్చారు. అది స్లీపర్ బస్సు, కండిషన్ బాగానే ఉందని చెప్పారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారని తెలిపారు.
“బస్సు లోపల పొగ నింపేసిన వెంటనే ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఎమర్జెన్సీ విండో చాలా చిన్నదిగా ఉంది. అదే చిన్న కిటికీని కొట్టి బయటికి వచ్చాం. మంటలు భయంకరంగా ఉన్నాయి. ముందుభాగంలో ఉన్న వారు దహనం అయిపోయారు. నేను వెనుక సీట్లో ఉండటంతోనే ప్రాణాలతో బయటపడ్డాను,” అని రామారెడ్డి ఆవేదనగా తెలిపారు.
ఆయనకు ఈ ప్రమాదం జరిగిన రోజు ఆయన పుట్టినరోజు అని కూడా పేర్కొన్నారు.
“దేవుడే కాపాడాడు. పుట్టినరోజు రోజు నాకు పునర్జన్మ ఇచ్చాడు,” అని చెప్పారు.
రెండు నోట్లో వేసుకుంటే చాలు రోగాలు దరిచేరవు .
ప్రమాదం తర్వాత పోలీసులు, ఎస్పీ ఆఫీస్ నుంచి సిబ్బంది నిరంతరం ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. “ప్రతి అరగంటకోసారి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన సహాయం మరువలేనిది,” అని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రామారెడ్డి మాట్లాడుతూ చివరగా అన్నారు –
“బస్సులో ఉన్నవారి కేకలు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతున్నాయి. చిన్న పిల్లల అరుపులు ఇంకా మైండ్ నుంచి పోవడం లేదు. దేవుడు ఎందుకు అలా చేశాడో అర్థం కావడం లేదు. డ్రైవర్, క్లీనర్ ఎవరూ ఆ సమయానికి అక్కడ లేరు. వారు ఉంటే, డోర్ ఓపెన్ చేసి ఉంటే, మరెంతమంది బతికి ఉండేవారు.”
ప్రేమ వివాహం… పదేళ్ల దాంపత్యం తర్వాత భర్తనే బలి ఇచ్చిన భార్య.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ రామారెడ్డి సంతాపం తెలిపారు. “నన్ను రక్షించిన వాళ్లు దేవుడి రూపంలో వచ్చారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను,” అని భావోద్వేగంగా ముగించారు.