CM Chandrababu: 6 కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్ కు వెళ్ళాను.

CM Chandrababu: 6 కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్ కు వెళ్ళాను.

CM Chandrababu: 6 కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్ కు వెళ్ళాను:

నా చుట్టూ ఉన్నవాళ్లందరూ యంగ్‌స్టర్స్‌నే. కానీ అనుభవం, ఆలోచనల్లో నేను వాళ్లకంటే ముందుండేవాడిని అనే నమ్మకం నాకు ఎప్పుడూ ఉండేది. వాళ్ల ఆలోచనలు కొంచెం నెమ్మదిగా ఉంటే, నేను మాత్రం వేగంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకునేవాడిని. అందుకే వాళ్లకు సరైన ఎక్స్పోజర్ ఇవ్వాలి, నిజంగా విషయాలు ఎలా జరుగుతాయో చూపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆరు నుంచి ఏడు మంది యువతను ఇక్కడికి తీసుకొచ్చాం. వాళ్లతో పాటు ఒక ఐఏఎస్ అధికారిని కూడా పరిచయం చేశాం.

చాలామందికి ఐఏఎస్ అంటే కేవలం ఉద్యోగం, అధికారం అనే భావన మాత్రమే ఉంటుంది. కానీ నిజానికి అది బాధ్యత. యువత ప్రో-యాక్టివ్‌గా మారాలి, మార్పు తీసుకురావాలనే ఆలోచన రావాలనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం చేశాం. వాళ్లు కోరుకుంటే ఏదైనా సాధించగలరనే నమ్మకం కలిగించడమే(CM Chandrababu) మా ఉద్దేశం.

MPDO Office Rent Issue:ప్రభుత్వ కార్యాలయానికే దిక్కులేదు.. అద్దె బకాయిలతో రోడ్డున పడ్డ అధికారులు.

మీలో ఒక సంస్కృతి పెరగాలి. మీ ఊరిలో ఉన్న బంధువులు, స్నేహితులు, మీతో పాటు పెరిగిన వాళ్లను కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలి. వారికి హ్యాండ్‌హోల్డింగ్ ఇవ్వడం మీ బాధ్యత అని గుర్తుంచుకోవాలి.

ఇంతవరకు మనం పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ద్వారా ఎయిర్‌పోర్టులు, రోడ్లు, ఐటీ కంపెనీలు నిర్మించాం. సంపద సృష్టి జరిగింది. కానీ దాంతో పాటు ధనికులు ఇంకా ధనికులయ్యారు, పేదవాడు మాత్రం పేదవాడిగానే(CM Chandrababu) మిగిలిపోయాడు. హావ్స్ అండ్ హావ్‌నాట్స్ మధ్య గ్యాప్ పెరిగిపోయింది.

CM Chandrababu

Remove Fat: పుచ్చకాయ ఇలా తింటే కేజీ బరువు పెరుగుతారు.

అందుకే ఇప్పుడు కొత్త ఆలోచన అవసరం—పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్‌నర్‌షిప్. మనలో చాలామంది ఒకే ఊరిలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్లమే. ప్రజల పన్నుల వల్లే మనకు అవకాశాలు వచ్చాయి. నాకు కూడా అలాంటి అవకాశం వచ్చింది. ఆరో తరగతి చదవడానికి రోజూ ఆరు కిలోమీటర్లు నడిచాను(CM Chandrababu). భోజనం పొట్లాలు కట్టుకుని హైస్కూల్‌కి వెళ్లి, మళ్లీ పన్నెండు కిలోమీటర్లు నడిచి ఊరికి వచ్చేవాడిని.

ఆ అవకాశాన్ని క్రమంగా సద్వినియోగం చేసుకున్నాను. ఈరోజు ప్రపంచానికి మేనేజ్‌మెంట్, టెక్నాలజీ పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాను. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇదే ఉదాహరణ.

చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగల బ్యాగ్‌.. మహిళ ఏం చేసిందంటే?

ఎన్టీఆర్ ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి చరిత్ర తిరగరాశారు. నరేంద్ర మోదీ గారు సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రజాస్వామ్య నాయకుడిగా నిలిచారు. అబ్దుల్ కలాం, అంబేద్కర్, మహాత్మా గాంధీ—ఎవరి జీవితాన్ని చూసినా ఒకే సందేశం కనిపిస్తుంది. అవకాశం అందరికీ వస్తుంది. దాన్ని(CM Chandrababu) ఉపయోగించుకున్నవారే చరిత్ర సృష్టిస్తారు.

Knee Pains: క్యాబేజీ తో మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పొచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *