Bigg Boss 9 Winner Pawan Kalyan
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ విజయవంతంగా ముగిసింది. మొత్తం 105 రోజుల పాటు కొనసాగిన ఉత్కంఠభరితమైన పోరాటానికి డిసెంబర్ 21న జరిగిన గ్రాండ్ ఫినాలేతో తెరపడింది. ఫినాలేలో సంజనా ఐదో స్థానంలో నిలవగా, ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. పవన్ రెండో రన్నరప్‌గా నిలిచినా, చివరికి విజేతగా అవతరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కేవలం బిగ్‌బాస్ స్టేజ్‌పై అడుగు పెట్టగలిగితే చాలని అనుకున్న స్థాయి నుంచి ట్రోఫీని ముద్దాడే స్థాయికి పవన్ చేరడం విశేషం. సామాన్యుడు అయినప్పటికీ తన సంకల్పబలంతో, కష్టపడి ఆడిన ఆటతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించాడు. సెలబ్రిటీ తనూజపై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకోవడం ద్వారా “సాధారణ వ్యక్తి తల్చుకుంటే సాధించలేనిది ఏమీ లేదు” అనే మాటకు అర్థం చెప్పాడు.
Dark Circles: ఖర్చు లేకుండా కళ్ళ కింద Dark Circles ని ఇలా పోగొట్టుకోవచ్చు.
ఈ విజయం కేవలం పవన్‌దే కాకుండా, అతడిలాంటి సామాన్యులందరికీ ప్రేరణగా నిలిచింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో తొలిసారిగా ఒక కామనర్ ట్రోఫీ గెలుచుకోవడం విశేషంగా మారింది. అందుకే అతడి విజయాన్ని సామాన్యులు తమ సొంత విజయంలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
రెమ్యునరేషన్ వివరాలు:
బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్న కామనర్‌లందరికీ ఒకే విధమైన రెమ్యునరేషన్‌ను షో నిర్వాహకులు నిర్ణయించారు. అందులో భాగంగా పవన్‌కు వారానికి రూ.70,000 చొప్పున పారితోషికం అందింది. మొత్తం 15 వారాల కాలానికి అతడు రూ.10.50 లక్షలు సంపాదించాడు.
పాతాళలోకం వినడమే గానీ ఎప్పుడైనా చూశారా?వైరల్ వీడియోలో బోరుబావి సాహసం.
ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ పొందే అవకాశం ఉన్నప్పటికీ, పవన్ రూ.15 లక్షల సూట్‌కేస్‌ను ఎంచుకున్నాడు. దాంతో మిగిలిన రూ.35 లక్షలు అతడి ఖాతాలోకి వచ్చాయి. అదనంగా రాఫ్ టైల్స్ సంస్థ నుంచి మరో రూ.5 లక్షల బహుమతి అందింది. ఇలా మొత్తం కలిపి పవన్ రూ.50 లక్షలకు పైగా సంపాదించాడు.
డబ్బుతో పాటు మారుతి సుజుకి విక్టోరిస్ కారును కూడా గెలుచుకున్నాడు. ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు విలువ సుమారు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉంటుందని సమాచారం.
పురుషుల్లో టెస్టోస్టిరోన్ తగ్గుదలకి నేచురల్ పరిష్కారం – అత్తిపత్తి వేళ్ల పొడి ప్రయోజనాలు.