Akhira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కుమారుడు అకీరా నందన్:
ఏఐ సాంకేతికత ద్వారా తన వ్యక్తిత్వం, గోప్యత హక్కులు ఉల్లంఘించబడుతున్నాయంటూ ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ (Akhira Nandan) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరుతో, రూపం-స్వరాన్ని ఉపయోగించి రూపొందించిన ‘ఏఐ లవ్ స్టోరీ’ సినిమా అలాగే సోషల్ మీడియాలో ఏర్పడిన నకిలీ ఖాతాలను తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారు.
Cancer: రాత్రిపూట లేటుగా అన్నం తినే వారికి క్యాన్సర్ వస్తుందా?
డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా తన ముఖ కవలికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వినియోగించడం గోప్యత హక్కుల ఉల్లంఘన అని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, ‘ఏఐ లవ్ స్టోరీ’ సినిమాపై తాత్కాలిక నిషేధం విధించింది. (Akhira Nandan)
కృత్రిమ మేధస్సు, డీప్ ఫేక్ సాంకేతికతతో వ్యక్తి ఇమేజ్, వ్యక్తిత్వాన్ని వక్రీకరించడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. అలాగే YouTube, Instagram, Facebook, X వంటి ప్లాట్‌ఫార్ములపై ఉన్న నకిలీ ఖాతాలను తొలగించాలని, సంబంధిత ఐపీ వివరాలు వెల్లడించాలని ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
Viral Video:కోర్టు హాల్‌లో భార్య దాడి.. నవ్వుతూ తప్పించుకున్న భర్త.. వైరల్ వీడియో వెనుక షాకింగ్ కథ!
ఈ కేసును జస్టిస్ తుషార్ రావు గెడేలా ధర్మాసనం విచారించింది. అఖిలానందన్ (Akhira Nandan)తరఫున సీనియర్ న్యాయవాది సాయి సాయిదీపక్ వాదనలు వినిపించగా, గూగుల్ తరఫున ఆదిత్య గుప్త, మెటా తరఫున వరుణ్ పాటక్ హాజరయ్యారు. మొత్తంగా ఏఐ ఆధారిత లవ్ స్టోరీ సినిమాపై ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది.
చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగల బ్యాగ్.. మహిళ ఏం చేసిందంటే?
షుగర్ ఉన్నవారు అన్నం తినాలా? ఏ ధాన్యాలు సురక్షితం – గ్లైసెమిక్ ఇండెక్స్ ఆధారంగా పూర్తి అవగాహన.


