ఆరోగ్య సమస్యల్లో ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. లివర్‌లో అధికంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా మద్యం ఎక్కువగా తీసుకునేవారిలో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మద్యం తాగని వారికీ కూడా ఈ సమస్య వస్తోంది. దీనినే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు.
అధికంగా చక్కెర ఉన్న ఆహారాలు తీసుకోవడం, స్వీట్స్ ఎక్కువగా తినడం, అలాగే ఫ్రూట్స్‌ను కూడా మోతాదుకు మించి తీసుకోవడం వల్ల లివర్‌లో కొవ్వు పేరుకునే ప్రమాదం పెరుగుతుంది. కొందరు ఆరోగ్యానికి మంచిదని భావించి ఉదయం లేవగానే అధికంగా పండ్లు తింటుంటారు. కానీ ఏ ఆహారమైనా పరిమితిలో తీసుకోవడం ఎంతో ముఖ్యం.
మీ జుట్టు ఇక ఊడదు దీన్ని ఇలా వాడితే….
ఫ్యాటీ లివర్ సమస్య తగ్గించుకోవాలంటే జీవనశైలిలో మార్పులు చాలా అవసరం. ముఖ్యంగా బ్లాక్ కాఫీ కొంతవరకు లివర్ ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర లేకుండా తీసుకునే బ్లాక్ కాఫీ లివర్‌లో కొవ్వు తగ్గించడంలో సహాయపడవచ్చు. అలాగే కొన్ని లివర్ సంబంధిత సమస్యలను నియంత్రించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అయితే బ్లాక్ కాఫీని పరిమితంగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలలోపు తాగితే శరీరానికి బాగా సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహారం, వ్యాయామం, నియంత్రిత జీవనశైలి పాటిస్తే ఫ్యాటీ లివర్‌ను చాలా వరకు నియంత్రించవచ్చు.
మంగ్లీ భాగోతం బయటపెట్టిన అడ్వకేట్ సుబ్బారావు.