Geetha Madhuri: యూరియా వేసే పరికరం తయారు చేసిన విద్యార్థి గీతా మాధురి:
ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే సంకల్పం అవసరం. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన గీతా మాధురి(Geetha Madhuri) చిన్ననాటి నుంచే తన తల్లిదండ్రులు, గ్రామ రైతులు ఎదుర్కొనే కష్టాలను గమనించింది. రైతులు యూరియా, ఎరువులు వేయడానికి గంటల తరబడి వంగి పనిచేయాల్సి రావడం వల్ల శ్రమ, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని గ్రహించింది. ఈ సమస్యకు పరిష్కారం కావాలనే ఆలోచనతో తన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ఒక తక్కువ ఖర్చుతో కూడిన ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ యంత్రంను రూపొందించింది.

Cancer: రాత్రిపూట లేటుగా అన్నం తినే వారికి క్యాన్సర్ వస్తుందా?
నాగర్కర్నూల్ జిల్లా పెద్దపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న గీతా మాధురి (Geetha Madhuri) రూపొందించిన ఈ యంత్రం మొక్కజొన్న, పత్తి, మిరప వంటి పంటలకు యూరియాను సులభంగా వేయగలదు. సుమారు రూ.1500 ఖర్చుతో తయారైన ఈ పరికరం వంగాల్సిన అవసరం లేకుండా, చక్రాల సహాయంతో నడుస్తూ ఎరువులు పడే విధంగా రూపొందించారు. ఒక వ్యక్తి రోజుకు 2 నుంచి 4 ఎకరాల వరకు ఎరువులు వేయగలిగేలా ఇది ఉపయోగపడుతుంది.

నారాయణపేట జిల్లాలో కోటి విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.
ఈ ఆవిష్కరణ రాష్ట్ర స్థాయి మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎంపిక కావడం విశేషం. రైతుల ఖర్చు, శ్రమ, సమయం తగ్గించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ పరికరాన్ని మరింత ఆధునికంగా మార్చేందుకు గీతా మాధురి(Geetha Madhuri), ఆమె ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారు. ఇది విద్యార్థి సృజనాత్మకతకు, రైతుల సమస్యలపై యువత ఆలోచనలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

Obesity: కొంతమంది ఎంత తిన్నా లావు అవ్వకపోవడానికి కారణం ఇదే.
Akhira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కుమారుడు అకీరా నందన్.