ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేట పరిధిలో పోలీస్ శాఖకు మచ్చతెచ్చే ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్‌తో పోలీస్ కానిస్టేబుల్ అనుచితంగా వ్యవహరించాడనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారాన్ని ప్రశ్నించిన ఆమె భర్తను కానిస్టేబుల్ బెదిరించాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
పాతాళలోకం వినడమే గానీ ఎప్పుడైనా చూశారా?వైరల్ వీడియోలో బోరుబావి సాహసం.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, గురజాల సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఆ మహిళ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. కొంతకాలంగా ఇద్దరి మధ్య అనుమానాస్పద సంబంధం ఉందని భావించిన ఆమె భర్త ఈ విషయం గురించి కానిస్టేబుల్‌ను నిలదీశాడు.
ఎముకలు ఎందుకు వీక్ అవుతున్నాయి? కూల్‌డ్రింక్స్ వల్ల వచ్చే నాలుగు ప్రధాన నష్టాలు.
ఈ క్రమంలో కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించి తనను బెదిరించాడని భర్త ఆరోపించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన అతడు తన ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడ ఎస్ఐ లేరని చెప్పి పోలీసులు ఫిర్యాదు నమోదు చేయకుండా అతడిని పంపివేశారని బాధితుడు వాపోయాడు.
యువతలో కొత్త రిలేషన్ ట్రెండ్ – ‘హుష్ డేటింగ్’ అంటే ఏమిటి?
కొన్నేళ్లుగా అదే పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కారణంగా సదరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆ కానిస్టేబుల్ గతంలో కూడా పలుమార్లు అవినీతి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయమైన విచారణ చేపట్టాలని బాధిత కుటుంబం కోరుతోంది.