
భారతదేశంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. బైక్ నడిపినా, కారు నడిపినా ప్రయాణికుల భద్రత కోసం ట్రాఫిక్ చట్టాలను కచ్చితంగా పాటించాలి.
నరాలు స్ట్రాంగ్ గా అయ్యి బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే | Rich Omega 3 Seeds
నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ట్రాఫిక్ రూల్స్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలాసార్లు ప్రజలు సాధారణ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇటీవల చెప్పులు వేసుకుని వాహనం నడపడం చట్టవిరుద్ధమని సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు వైరల్‌గా మారాయి.
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్..
అయితే వాస్తవం ఏమిటంటే చెప్పులు వేసుకుని కారు లేదా ద్విచక్రవాహనం నడపడం నేరం కాదు. మోటారు వాహన చట్టం ప్రకారం చెప్పులు ధరించి డ్రైవ్ చేస్తే ఎటువంటి జరిమానా లేదా చలానా విధించే నిబంధన లేదు. కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ట్రాఫిక్ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవద్దని, ప్రజల్లో అవగాహన పెంచుకోవాలని గతంలో సూచించారు.
బాడీలో వేడి వెంటనే తగ్గుతుంది | Relief from Period Cramps
అయితే చెప్పులు వేసుకుని డ్రైవ్ చేయడం సురక్షితమా అనే ప్రశ్న మాత్రం ముందుకు వస్తుంది. రవాణా నిపుణుల ప్రకారం, చెప్పులు పెడల్స్ లేదా గేర్ లీవర్‌పై సరిగా పట్టుకోకపోవడం వల్ల కాలు జారి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చెప్పుల కంటే షూలు ధరించడం మరింత భద్రంగా ఉంటుందని వారు సూచిస్తున్నారు.
