
Whats App New Update: ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సౌకర్యంగా ఉండేలా కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది.. వాట్స్ యాప్ సురక్షితం కాదు అన్న ఎలాన్ మస్క్ ఆరోపణలను తిప్పికొడుతూ మార్క్ జుకర్ బర్గ్ కొత్త కొత్త ఫీచర్స్ తో యూజర్లను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పటికే గ్రూపుల్లో, చాట్స్ లో ఎవరికైనా పంపిన వాట్సాప్ మెసేజులను ఎడిట్ చేసుకునే ఫీచర్ ను తీసుకొస్తున్న వాట్సాప్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
వాట్సాప్ ప్రస్తుతం ” లాక్‌చాట్” పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్‌తో యూజర్లు తాము కోరుకుంటున్న చాట్‌ను ఇతరులకు కనిపించకుండా చేయవచచ్చు. . ఈ ఫీచర్ లో మీరు ఎంచుకున్న కాంటాక్ట్‌ను పాస్వర్డ్ లేదా ఫింబర్ ప్రింట్‌తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లాక్‌చాట్ లో మీరు ప్రొటెక్ట్ చేసుకున్న కాంటాక్ట్ చాట్ బాక్స్‌లో కూడా కనిపించదు. ఒకవేళ మీకు ఆ కాంటాక్ట్ నుండి మెసేజ్ వచ్చినా పైన కనిపించే నోటిఫికేషన్లో ఆ మెసేజ్ కనిపించదు.
ఈ కొత్త ఫీచర్ తమ పర్శనల్స్ ని సీక్రెట్ గా ఉంచేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నేపధ్యంలోనే ఈ కొత్త ఫీచర్ కి సంబంధించిన వీడియోను మెటా సంస్థ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఈ కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలి? దానివల్ల కలిగే లాభాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియో లో వెల్లడించారు. సోమవారం రాత్రి నుంచి యూజర్లకు ఈ అప్డేట్ అందుబాటులోకి వచ్చయిచ్చింది.. ఈ ఫీచర్ కు సంబంధించిన విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించారు.