
Married Life: ఇప్పుడున్న కాలంలో చాలామంది సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని 30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకొంతమంది 35 దాటినా కూడా అసలే చేసుకోవడం లేదు.. ఇక నటుల విషయానికి వస్తే 45 ఏళ్లలో పెళ్లి చేసుకుంటున్నారు. ప్రస్తుత ఉన్న పరిస్తితుల్లో యువకులకు ఉద్యోగ నిర్వహణ ఓ సవాలుగా మారుతుంది. ఈ క్రమంలో సంసారంపై ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితిని మరిచిపోతుంటారు. అయితే ఈ ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది.
ఇక కట్టుకున్న భార్యకు ఇబ్బందులు తప్పవు. మన స్వార్థం కోసం వారిని బలి చేయాల్సి వస్తుంది. అందుకే పెళ్లి తొందరగా చేసుకుంటేనే మీకు ప్రయోజనం కలుగుతుందని గుర్తుంచుకోవాలి.ప్రస్తుత పరిస్తితితులలో 30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామందికి ఒక నిర్ణీతమైన వయసులోనే పెళ్లి చేసుకోవాలని అనిపించదు.. అయితే వీరికి జీవితంలో పెళ్లి కంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి.. ఇంకొంత మంది ఒక మంచి పొజిషన్ కి వచ్చాక పెళ్లి చేసుకుందామనుకుంటారు.. అయితే అలాంటి వారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
అయితే 30 ఏండ్లు దాటిన తర్వాత పెండ్లి చేసుకుంటే సెక్స్ సమస్యలు రావు. కానీ మరీ తక్కువ వయసున్న అమ్మాయిని చేసుకోవద్దు. ఒక వేళ 32 సంవత్సరాల అబ్బాయి, 28 నుంచి 29 ఏండ్ల మధ్య వయసున్న అమ్మాయిని చేసుకోవచ్చు. అయితే వయసులో పది, పన్నెండేండ్ల వ్యత్యాసం ఉన్న అమ్మాయిని చేసుకుంటే.. సంసార జీవితంలో సమస్యలు, భావోద్వేగాల్లో చికాకులు వస్తాయి. అలాగే అమ్మాయి వయసు నీకన్నా ఐదేండ్లు ఎక్కువగా ఉన్నా చేసుకోవచ్చు ఏమీ కాదు.
భవిష్యత్ పై బెంగతో ఉన్న జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతారు. నిత్యం సమస్యలతో సతమతమవుతుంటారు. దీంతో వైవాహిక జీవితం పట్ల ప్రత్యేక సమయం కేటాయించలేకపోతారు. దీని వల్ల సమస్యలు చుట్టుముడతాయి. పక్కదారులు తొక్కే ప్రమాదాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు ఇరవై నాలుగేళ్ల నుంచి ఇరవై ఆరు ఏళ్ల మధ్య వివాహం చేసుకుంటేనే అన్ని అనుకూలంగా మారుతాయి.