
మెగాస్టార్ గొప్పతనం గురించి ఎప్పుడో ఒకసారి వింటూనే ఉంటారు. ఏపి లో సినిమా టికెట్ రేట్స్ తగ్గించిన విషయంలో చిరంజీవి ఎంతో తగ్గి, ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసాడని స్వయంగా రాజమౌళి అంతటి వాడు ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్తే కానీ చాలామందికి మెగాస్టారు గొప్పదనం ఏంటో తెలియలేదు. ఒక సినిమాకి ఒక హీరో మాత్రమే కాదు ప్రతి ఒక్కరి శ్రమ ఫలితమే సినిమా, అలాంటి సినిమా ఆగిపోతే పెట్టుబడి పెట్టిన నిర్మాతలు, ఆశగా సినిమా రిలీస్ కోసం ఎదురుచూసుతున్న అభిమానులు ఎంతగా ఇబ్బండి పడతారు.
అయితే ఇక అసలు విషయానికి వస్తే బాస్ చిరు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉంది. చిరు సినిమా వాల్తేరు వీరయ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి సరిగ్గా పర్మిషన్ ఇవ్వలేదు ఏపీ ప్రభుత్వం. అయితే వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేశారు. కానీ ముందుగా అనుకున్న ప్లేస్ లో కాకుండా చివరికి ఏపీ ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఒక ప్లేస్ కేటాయించి మీరు ఇక్కడ ఈవెంట్ చేసుకోండి అంటూ పర్మిషన్ ఇచ్చింది.
ఈ విషయం పై మెగాస్టార్ మాట్లాడుతూ ఈవెంట్ కి సరిగ్గా పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వానికి, అధికారులకి కూడా థాంక్స్ చెప్తూ చిరు ‘వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్’లో మాట్లాడాడు. అయితే చిరు అభిమానులు మాత్రం ఎందుకు బాస్ తగ్గుతున్నాడు అంటూ నిరాశ చెందారు. అయితే మెగాస్టార్ చిరు ఈ విషయం పై మాట్లాడుతూ “తగ్గడం చాలా అవసరమే… ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఫైర్ అయితే నా ఇగో సాటిస్ఫై అవుతుంది కానీ సినిమా, ప్రొడ్యూసర్స్, ఫాన్స్ ఇబ్బంది పడాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీనితో ఆయన ఫాన్స్ ఒక్క సినిమా కోసం ఇంత లా ఆలోచిస్తున్న అన్నయ్య సినీ ఇండస్ట్రి కి పెద్ద దిక్కుగా ఉన్నాడు అంటూ జై చిరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.