
తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఒక సంచలనం నమోదు కాబోతోంది. ఇండస్ట్రి లో గొప్ప హీరోలు అయిన పవన్ కళ్యాణ్ బాలకృష్ణ కలిసి ఒక షో చేయడం ఏదైతే ఉందో తెలుగు చిత్ర ప్రేమికులు ముఖ్యంగా హీరో బాలయ్య హీరో పవన్ కళ్యాణ్ అభిమానులు అసలు నమ్మలేకపోతున్నారు. ఇంకా ఈ షో నిజమా కల నా అనుకునే స్థాయిలో ఇంకా ఉన్నారు. ఇప్పటి వరకు బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో కి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు ప్రస్తుతం ఈ షో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ షో గురించి తెలుసుకున్న వేలాది మంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియో దగ్గర నానా హంగామా చేస్తున్నారు.
ఈ షో యొక్క ప్రోమో 2 విడుదల చేయగా షో లో హీరో పవన్ కళ్యాణ్ జేబులో చేతులు పెట్టుకోవడంపై బాలయ్య సరదాగా మాట్లాడారు. ఎవరినీ కొట్టకుండా ఆపుకునేందుకు జేబులో చేతులు పెట్టుకున్నావేమోనని తనకు అనిపిస్తుందని అనగా.. పవన్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. ఈ మధ్యే పవన్ కళ్యాణ్ కారు టాప్‌పై కూర్చొని ప్రయాణించగా విమర్శలు వచ్చాయి. బాలయ్య షో లో ఫొటోను చూపిస్తూ ఏంటి గొడవ అని అడిగారు.అయితే వెంటనే పవన్ కళ్యాణ్ ‘కారులో వెళ్లకూడదు.. కారులో నుంచి బయటక రాకూడదు.. రూమ్‌లో ఉండకూడదు.. రూమ్‌లో నుంచి బయటకు రాకూడదంటే చాలా కాలం తరువాత కొంచెం తిక్క వచ్చింది. అంటూ పవన్ సమాధానమిచ్చారు.
బాలయ్య పవన్ కళ్యాణ్ ను ఎందుకు పార్టీ స్థాపించాల్సి వచ్చిందని అడగ గా పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ఈ ప్రశ్న కు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ ప్రశ్నలకు పవన్ ‘ఎంతసేపు మనం ప్రాథమిక హక్కులు గురించి మాట్లాడుతాం కానీ.. ప్రాథమిక బాధ్యతల గురించి మాట్లాడం..’ అని సమాధానం ఇచ్చారు. మీ మేనిఫెస్టో పూర్తిగా జనాల్లోకి వెళ్లకపోవడమేమో అంటూ బాలయ్య ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో నీకు ఫ్యాన్ కానటువంటి వారెవరూ లేరు.. మరి ఆ ప్రేమ ఓటుగా ఎందుకు మారలేదని అడిగారు. ఎవరైనా ఎదుగుతూ ఉంటే.. వారిని ఎదగనీయకుండా చేయడం వ్యూహంలో ఒక భాగం అంటూ పవన్ అన్నారు.
ఇలా ప్రశ్నలతో షో సాగుతుండగా ప్రోమో చివర్లో డైరెక్టర్ క్రిష్ సందడి చేశారు. మా ఇద్దరితో పనిచేశావు కదా.. డిఫరెన్స్ ఏంటి..? అని బాలకృష్ట ప్రశ్నించగా.. ఒక సింహం, ఒక పులి మధ్యలో నా తల ఉందంటూ సమాధానం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసి.. ప్రజా సేవకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని బాలయ్య అడగ్గా.. ఆడియన్స్ నుంచి ఎక్కువ శాతం ఎస్ అని సమాధానం వచ్చింది. ఆడియన్స్‌లో కూర్చుకున్న డైరెక్టర్ క్రిష్ కూడా యస్ అని గట్టిగా అరిచాడు. పార్ట్-2 ఎపిసోడ్ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. చూద్దాం పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎంటో మీరు ఒక సారి ఫిబ్రవరి 10 షో ను చూడండి.