
ప్రస్తుతం ఈ చిన్నారి ఫోటో కొన్ని ఏండ్లు గా సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంది. అయితే ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నది. ఈ ముద్దు గుమ్మ అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నది. ఈ స్టార్ హీరోయిన్ తెలుగు, తమిళం, మలయాళం ఇండస్ట్రీలలో ఎందరో ప్రముఖ హీరోల సరసన కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోల మూవీస్ కి ఈ హీరోయిన్ అంటే ముందు ఈమె పేరునే గుర్తుకు చేసుకునే వారు అని చెప్పవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే ఈ ఫొటోలో కనిపిస్తున్న పాపాయి 1983లో మే 04న మద్రాస్‌లో జన్మించింది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ వెలిగిన చెన్నై చంద్రం త్రిష కృష్ణన్. ఈ ముద్దు గుమ్మ 2003లో వచ్చిన నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయం అయింది. ఈమె టాలీవుడ్ లో వర్షం మూవీ తో స్టార్ స్టేటస్ దక్కించుకున్నది. హీరోయిన్ త్రిష టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరో ల అందరితో కలిసి నటించింది. ఈ ముద్దు గుమ్మ ఇటు కుర్ర హీరోలు,

అటు సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రజినికాంత్ వంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసి రెండు తరాల హీరోయిన్గా సత్తా చాటింది త్రిష.ప్రస్తుతం సీనియర్ హీరోల సినిమాలకు ఈ ముద్దు గుమ్మ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.త్రిష ఓ అజంతా శిల్పం.ఇప్పటికీ తరిగిపోని అందం ఆమె సొంతం. చిత్ర పరిశ్రమ లోకి వచ్చి ఇరవై ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ అదే గ్లామర్ మెంటైన్ చేస్తూ వస్తోంది. ఇక హీరోయిన్ త్రిష ని పెట్టి పాన్ ఇండియా సినిమాలు కూడా తీస్తున్నారు. ఇప్పటి వరకు ఈ భామ తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా అన్ని చోట్ల నటించి అందరికీ మెప్పించింది.

కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ కేవలం తమిళ సినిమాలే చేస్తోంది. ఈ మధ్యే రిలీస్ అయిన మెగాస్టార్ చిరంజీవి మూవీ లో ఆయన సరసన ఆచార్య సినిమాలో ఛాన్స్ వచ్చినా వదులుకున్నది. ఇప్పుడు త్రిష నటించిన నాలుగు తమిళ సినిమాలు, ఒకటి మళయాళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ చిన్నప్పటి ఫోటో ఎంత మంది గుర్తుపట్టారో కామెంట్ చేయండి.
