
Sharath Babu: నటుడు శరత్ బాబు హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పాత్రలతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వచ్చారు. ఇక ఆయన ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు శరత్ బాబు తెర మీద ఆయన కాకుండా.. ఆయన చేసిన క్యారెక్టర్సే కళ్ల ముందు మెదులుతాయి. శరత్ బాబు నటనలోని గొప్పతనం అది అని చెప్పవచ్చు..
నటుడు శరత్ బాబుకి కొన్నాళ్లు ముందు చెన్నైలో ఆరోగ్యం పాడైంది. అయితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న ఆయన ఓ పని మీద హైదరాబాద్ వచ్చారు. మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు.అయితే ఆయన కొన్నాళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలోనె సోమవారం మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ కావటంతో ఆయన కన్నుమూశారు.
నటుడు శరత్ బాబు సాగర సంగమం, సితార, సీతాకోక చిలుక చిత్రాల్లో పండించిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తోడుగా నిలిచే హ్నేహితుడిగా, జమిందార్ కావాలని కలలు కనే పేద ధనికుడిగా, చెల్లెలి ప్రేమకు అడ్డుగా నిలిచే అన్నగా.. ఇలా వేరు వేరు రకాల భావోద్వేగాలను అవలీలగా పలికించి తన అద్భుత నటతో ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్నాడు.
శరత్ బాబు ఇండస్ట్రి లో కొనసాగుతూ చెన్నై బెంగళూరు హైదరాబాద్ వంటి ప్రాంతాలలో ఎంతో ఖరీదైన ఇళ్లను ఖరీదైన స్థలాలను కొనుగోలు చేశారు అని టాక్.. అయితే ఆయనకు ఎంతో ఇష్టమైన హార్సిలీ హిల్స్ లో ఒక అందమైన ఇంటిని కట్టుకొని అక్కడ స్థిరపడాలన్నదే తన కోరిక అట. ఇప్పుడు అక్కడ ఇంటి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇంతలోనే ఆ ఇంటిలో ఈయన నివసించకుండానే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శరత్ బాబు మరణించారని తెలుస్తోంది.