
ఓ స్టార్ క్రికెటర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాడు. అతనే బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్. ఈయన మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అయితే ఒక ప్రమోషనల్ ఈవెంట్ కోసం చటోగ్రామ్‌లో హాజరు అయ్యారు షకీబ్. అయితే ఆ ఈవెంట్ కి పెద్ద మొత్తం లో అభిమానులు వచ్చారు.
కోపం తో ఈవెంట్లో షకీబ్ అల్ హసన్ అభిమానిని క్యాప్ తో కొట్టాడు. అయితే షకీబ్ ఒక ప్రచార కార్యక్రమంలో తన కోపాన్ని అదుపు చేసుకోకుండా ఆవేశంతో అభిమానిని క్యాప్‌తో కొట్టాడు. ప్రస్తుతం అభిమానిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరో వివాదంలో చిక్కుకున్నాడు షకీబ్.
షకీబ్ అభిమానిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.షకీబ్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడంతో కొత్తేమీ కాదు. చాలా సందర్భాల్లో షకీబ్ అననుకూల నిర్ణయం కోసం అంపైర్లతో యానిమేషన్ పద్ధతిలో గొడవ పడ్డాడు.ఈ వీడియో వైరల్ కావడంతో షకీబ్‌కు వ్యతిరేకంగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
