టాలీవుడ్ లో మరో ప్రేమ జంట..బర్త్ డే విష్ పై నెటిజన్ల కామెంట్స్.

రెజినా, సందీప్ కిషన్‌లు టాలీవుడ్ లో వీరిద్దరూ తెలియని వారు ఉండరు. వీరిద్దరూ వారి కెరీర్ స్టార్టింగ్‌లో కలిసి పని చేశారు.అయితే రొమాంటిక్ లవ్ స్టోరీ అంటూ ఓ మూవీ లో కలిసి నటించారు. ఆ తరువాత ఇద్దరు కలిసి కొన్ని మూవీస్ కూడా చేశారు. అయితే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ అప్పట్లో టాక్ కూడా వచ్చింది. సందీప్ కిషన్‌తో మూవీస్ లో నటించిన రెజినా, రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ ఇలా అందరూ కూడా త్వరత్వరగా స్టార్ హీరోయిన్లుగా ఎదిగిపోయారు. కానీ సందీప్ కిషన్‌ మాత్రం ఇంకా మిడ్ రేంజ్‌ హీరోగానే ఉన్నాడు.

సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన కు ఆశించిన హిట్లు దక్కకపోవడంతో కెరీర్‌లో కాస్త వెనకబడ్డాడు. అయితే మధ్య మధ్యన కొన్ని చిన్న చిన్న హిట్లు దక్కినప్పటికీ సక్సెస్ గ్రాఫ్ మాత్రం స్థిరంగా లేదు. ఇప్పుడు రంజిత్ జయకోడి దర్శకత్వంలో ‘మైఖేల్’ చిత్రం చేస్తుండగా.. ప్రస్తుతం ఈ మూవీ పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు సందీప్ కిషన్. ఇది ఇలా ఉండగా తన కోస్టార్, హీరోయిన్ రెజీనా కసాండ్ర బర్త్‌డే కావడంతో స్పెషల్‌గా ఆమెను విష్ చేశాడు సందీప్ కిషన్.

ఈ విషయం తో ప్రస్తుతం సందీప్ కిషన్ – రెజీనా డేటింగ్ లో ఉన్నారంటూ నెట్టింట రూమర్ క్రియేట్ అయ్యింది. గతంలోనే వీరూ క్లోజ్ గా మూవ్ అవుతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. బర్త్ డే విష్ తో మళ్లీ వీరి ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే ఈ సందర్భంగా ఓ ఫొటో కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఈ నేపధ్యం లో సందీప్ కిషన్ రెజీనాకు చాలా దగ్గరి వ్యక్తిలాగా విష్ చేస్తూ ఓ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే పాప. లవ్ యూ అంటూ అన్ని విషయాల్లో ఎప్పుడూ నీకు మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నాను.’ సోషల్ మీడియా వేదిక గా ట్వీట్ చేశారు.

ఇక విషెస్ తో పాటు వారిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోను కూడా షేర్ చేశాడు. అయితే ఫొటోలో రెజీనా కూడా సందీప్ తో చనువుగా కనిపించింది. ఈనేపధ్యంలో వీరిద్దరూ డేటింగ్ నిజమే అంటూ నెట్టింట రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇక పొగలేనిదే మంట రాదనే తీరుగా వీరి ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సందీప్, రెజీనా ఈ విషయం పై ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *