
తెలుగు ఇండస్ట్రి లో నటి సమంత తెలియని వారు ఉండరు. మొదటి సినిమా తో యువతలో చాలా క్రేజ్ పెంచుకుంది అని చెప్పవచ్చు. అయితే ఈ సమంత రుతుప్రభు ఇప్పుడు శాకుంతలం అనే మూవీ లో నటిస్తోంది. శాకుంతలం లో ఈమెది మామూలు క్యారెక్టర్ కాదు. ఒక చాలెంజింగ్ పాత్ర చెప్పవచ్చు. . అయితే ఆ మూవీ షూటింగ్ పూర్తయింది కానీ ఇంకా విడుదల కాలేదు. ఈ మూవీ లో మలయాళీ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్ర లో నటిస్తున్నాడు. . ఈ సినిమా ను గుణ శేఖర్ డైరక్షన్ లో నిర్మాత దిల్ రాజు, నీలిమా గుణ సంయుక్తంగా నిర్మించారు.
ఈ మూవీ నిజానికి ఇది ఒక పౌరాణిక సినిమా. ఈ సినిమాలో ప్రముఖ పాత్రల్లో.. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తుండగా.. హీరోయిన్ సమంత.. శాకుంతల అనే పాత్రలో నటిస్తుంది. అయిత ఈ మూవీ కి సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించగా ఈ మూవీ లో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్, ప్రకాష్ రాజ్ తదితరులు కూడా నటించారు. ఈ మూవీ విడుదల ఎప్పుడవుతుందో తెలియదు కానీ..ప్రస్తుతానికి మూవీ ప్రమోషన్స్ మాత్రంమొదలు పెట్టరు. ప్రమోషన్ లో బాగంగా హీరోయిన్ సమంత.. యాంకర్ సుమతో ముచ్చటించారు. యాంకర్ సుమకు సమంత సినిమా ముచ్చట్లను చెప్పుకొచ్చారు.అయితే ఈ మూవీ ని సమంత ఎందుకు ఒప్పుకున్నారో అ మూవీ గురించి మొత్తం చెప్పుకొచ్చారు.
అయితే ఈ మూవీ లో స్పెషల్ గెస్ట్ గా నటించిన అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి కూడా చెప్పుకొచ్చింది. అయితే అల్లు అర్హకు ఇంగ్లీషే రాదు తను చాలా క్యూట్ గా ఉందని.. అసలు తను తెలుగు చాలా బాగా మాట్లాడుతోందని సమంత చెప్పుకొచ్చింది. అర్హకు తెలుగు భాష అంత స్పష్టంగా వస్తుందని, తను హాయ్ అనే పదం కూడా తెలుగులోనే చెబుతోందని ఇదంతా తన పేరెంట్స్ క్రెడిట్ అని చెప్పుకొచ్చింది. సమంత ఇంకా.. మధ్య మధ్యలో తన గతం గురించి గుర్తు తెచ్చుకొని బాధపడింది., ఇంకెందుకు ఆలస్యం సుమతో సమంత ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.