
Vitamin D: ప్రకృతి మనకిచ్చిన కాలాలలో వేసవి కాలాన్ని ఎక్కువగా ఇష్టపడరు. కానీ వేసవి కాలం శరీరానికి చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా డి విటమిన్ ఒకటి బాగా లబిస్తుంది .ఈ వేసవి కాలంలోవచ్చేచెమట, అంటే మన శరీరంలో ఉంటున్న చెడు వ్యర్ధాలు అన్ని కూడా ఈ చెమట ద్వారానే వేసవి కాలంలో ఎక్కువగా బయటకి వెళ్తుంది. ఇమ్యునిటి కూడా బాగా పెరుగుతుంది.
ఎందుకంటే వచ్చేది వర్షా కాలం కాబట్టి ఇన్ఫెక్షన్స్ వంటీ చిన్న,చిన్న వ్యాధుల నుండి విముక్తిని పొందడానికి ఈ ఇమ్యూనిటీ సహకరిస్తుంది. జుట్టు కూడా ఎక్కువగా రాలదు ఈ వేసవి కాలంలో. అలాగే మనం తిన్న ఆహారం కూడా తక్కువ సమయం లోనే డైజెస్ట్ అవుతుంది. మన శరీరం ఉల్లాసంగా కూడా ఉంటుంది ఈ వేసవి కాలం లో. వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల నీరు కూడా ఎక్కువ గా మనం తీసుకుంటాం.
వేసవి కాలం వల్ల ప్రకృతికి కూడా మంచిదే, ఎలా అంటే వేసవి కాలం పొల్యూషన్, చెడు కీటకాల లాంటివి కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. అందుకే ఈ వచ్చిన వేసవి కాలాన్ని అసహ్యించు కోకుండ బాగా ఉపయోగించుకుందాం.అలాగే వచ్చే వర్షా కాలంలో జబ్బుల పాలు పడకుండా ఇప్పుడే మనం ఇమ్యూనిటీ నీ పెంచుకొని వాటికి దూరంగా ఉందాం. అందుకే వేసవి కాలం ఇతర కాలాలకంటే మన శరీరానికి చాలా మేలు చేస్తుంది అని నిపుణులు అంటున్నారు.