
Reduce Nerve Weakness: ఈ మధ్య యువతకు కూడా నరాలు బలహీనంగా ఉంటున్నాయి. దీనివల్ల వారు చాలా బాధపడుతున్నారు. మన స్పైనల్ కార్డుకు ఉన్న ఒక లక్షణం ఏమిటంటే. అది దానంతట అదే నిర్ణయాలు తీసుకొని మిగతా భాగాల్లోకి తెలియజేస్తుంది. నరాలు దెబ్బ తినడం వీక్ అవ్వడం అనేది ఆరోగ్యవంతులకు జరగనే జరగదు.
మనం తినకూడని ఆహారం తిన్నప్పుడు స్పైనల్ కార్డుకు ఉన్న పై పొర ఉన్న మైలిన్ షీట్ అనేది దెబ్బతిన్నప్పుడు. ఈ నరాల వీక్నెస్ అనేది వస్తుంది. ఇది బాగా ముసలి వాళ్ళలో కనబడుతుంది. ఇది ముఖ్యంగా విటమిన్ బి 12 లోపం వల్ల వస్తుంది. సరిగ్గా బి విటమిన్ అందకపోవడం వల్ల వీటి పనితీరు మారి జబ్బులు వస్థాయి. నరాల ఒత్తిడి ఎందుకు వస్తుందంటే ఫైనల్ కార్డుకు జతగా ఉన్న అటువైపు, ఇటువైపు, మధ్యలో డిస్క్ అనే ది ఉంటుంది. అది పలుచగా అయినప్పుడు….
లేదా పగిలి పోయినప్పుడు. దానిలో ఉన్న ఫ్లూయిడ్ అంతా బయటికి రావడం వల్ల నరాల ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఆ బయటికి వచ్చిన ఫ్లూయిడ్ నరాలను బాగా ఒత్తిడి చేస్తుంది దీనివల్లే మనకు కాళ్లు, చేతులు, మెడలు, గుంజడం. నడుము నొప్పి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే మన స్పైనల్ కార్డును ఆరోగ్యంగా ఉంచినట్లయితే మనం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.