
Rakul Preeth Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి తనదైన గుర్తింపు పొందింది ఈ ముద్దు గుమ్మ. . తన కెరీర్ మొదట్లోనే తెలుగు, తమిళ చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆమె ఈ మధ్య హిందీ చిత్ర పరిశ్రమ వైపే ఫోకస్ చేసింది. అయితే మరో స్టార్ బ్యూటీ సమంత కూడా ఐస్ బాత్ చేస్తూ దర్శనమివ్వడంతో హీరోయిన్లు ఇలా వరుసగా సాహసం చేస్తుండటం వారి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
ఈ ముద్దు గుమ్మ గడ్డ కట్టే మంచులో చేసిన ఈ ఫీట్ చూసి అభిమానులు ఆశ్చర్య పోతున్నారు.. రకుల్ ప్రీత్ సింగ్ మైనస్ డిగ్రీల టెంపరేచర్లో ఏకంగా బికినీలో గడ్డ కట్టే నీటిలో ఐస్ బాత్ చేసింది. ఈ భామ బ్లూ బికినీలో చేసిన సాహసాన్నిచూసిన అభిమానులు ప్రశంసిస్తున్నారు. మరికొంత మంది అయితే -15 డిగ్రీల వాతావరణంలో ఇలా చేయాలి అంటే ఎంతో ధైర్యం ఉండాలని ఆమె అభిమానులు చెబుతున్నారు.
అసలు ఏం జరిగింది అంటే ఓ కట్టెల ఇంటిలో నుంచి బికినీలో నడుచుకుంటూ వచ్చిన రకుల్.. అక్కడే గడ్డకట్టిన మంచు మధ్యలో ఉన్న నీటిలో కాసేపు మునిగింది. ఆ తర్వాత నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. రకుల్ షేర్ చేసిన ఈ వీడియోను చూసిన అభిమానులు అవాక్కవుతున్నారు. అంతటి గడ్డకట్టే చలిలో అలా బికినీలో ఐస్ బాత్ చేయడం నిజంగా సాహసమే అంటూ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.