
Emotional video: ముసలితనం మనిషిని చాలా విధాలు గా బాధపెడుతుంది.రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి కూడా అనేకమంది పెద్దలు అనుభవిస్తున్నారు. అలాంటి తమ కడుపు నింపుకోవడం కోసం నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. పొట్ట కూటి కోసం కొన్ని సార్లు ఏ పని అయినా చేయాల్సి వస్తుంది.
అసలు కథ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ యూజర్ ‘పాండే రిత్విక్’ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో క్యాప్షన్‌లో 95 ఏళ్ల ఆ తాత ఇప్పటికీ కష్టపడి సంపాదించుకుని తింటున్నాడు. అయితే ఆ వీడియో లో ఆ వృద్దుడు డ్రమ్ వాయిస్తూ.. ఒక్కోసారి అలసిపోయి నేలపై కూర్చుంటున్నాడు. ఇప్పటి వరకు..
ఈ వీడియో ని 18.3 మిలియన్లుకు పైగా చూశారు మరియు 28 లక్షల కు పైగా లైక్ లు కూడా కొట్టారు. మరికొంత మంది వీక్షకులు అయితే ఈ వీడియో చూసి ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.