
ఈటీవి నెంబర్ వన్ కామెడీ షో జబర్దస్త్ తో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుని ని సంపాదించుకున్న కమెడియన్ ‘రాకింగ్ రాకేష్’. అయితే యాంకర్ సుజాత ప్రముఖ న్యూస్ ఛానల్ లో ‘జోర్దార్ సుజాత’ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్. ప్రస్తుతం సుజాత ఒక కమెడియన్ కూడా. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారు అంటూ గత కొంత కాలంగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు వాటిని నిజం చేస్తూ వారు పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ప్రకటించారు. అయితే సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తమ ప్రేమని ప్రేక్షకులకు తెలియజేస్తూ, పెద్దల అంగీకారంతో త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ పోస్ట్ చేసింది. సుజాత టీవీ ఛానల్స్ లో యాంకర్ గా అడుగుపెట్టి బిగ్ బాస్ షో లో ఆకాశమందుకొని సెలబ్రిటీ హోదాను అందిపుచ్చుకుంది..

ఆ తర్వాత ఆమె జబర్దస్త్ లో కమెడియన్ గా అడుగు పెట్టి రాకేష్ టీంలో చేరింది. ఈ ముచ్చటైన జంట మధ్య ప్రేమ ఏర్పడింది. కొంతకాలం తమ ప్రేమ జీవితాన్ని ఎంజాయ్ చేయగా కొన్ని సార్లు గతంలో తమ ప్రేమ విషయాన్ని వారే తెలిపారు. ఈ మధ్యనే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ చేసుకోగా ఆ వేడుకకు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ ముచ్చటైన జంట పెళ్లి కి ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు యాంకర్ రవి, గెటప్ శీను, ఏపీ మినిస్టర్ రోజా కుటుంబంతో కలిసి హాజరయ్యి కొత్త దంపతులను అశ్విరదించారు. కొత్త జంట ఫోటోలను రోజా గారు షేర్ చేస్తూ ‘నాకు అత్యంత ఆప్తులు నన్ను అమ్మా అని పిలిచే రాకేష్ మరియు సుజాత పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు ఈ ముచ్చటైన జంట నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో వర్ధిల్లుగాక’ అంటూ ఆమె సోషల్ మీడియా లో రాసుకోచింది. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
