ఎంత ఖర్చు అయిన పెట్టుకుంటా..ఆర్పీ పై ప్రశంసల వర్షం.

జబర్దస్త్ కిరాక్ ఆర్పీ తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఈయన నెల్లూరు చేపల పులుసు అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. అయితే కిర్రాక్ ఆర్పీ ఈ విధంగా ఓ మంచి పని చేయడానికి ముందుకు వచ్చాడు.పంచ్ ప్రసాద్‌ గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కిరాక్ ఆర్పీ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్‌‌కి కిడ్నీ ఆపరేషన్ చేయిస్తానంటూ ముందుకు వచ్చాడు. ఇక ఆయన దయ హృదయం తో కేవలం ఆపరేషన్ ఖర్చులే కాకుండా పంచ్ ప్రసాద్‌ కి ప్రతినెల ఇంటి అద్దెతో సహా అన్ని ఖర్చులు పెట్టుకుంటానని మీడియా వేదికగా మాట ఇచ్చాడు.

తాను ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనని వీలైతే వచ్చే నెలలోనే పంచ్ ప్రసాద్‌కి ఫస్ట్ చెక్ ఇస్తానన్నాడు . కిరాక్ ఆర్పీ, పంచ్ ప్రసాద్‌ ఆపరేషన్‌కి రూ.10 లక్షలు అయినా రూ.15 లక్షలు అయినా తానే ఖర్చు పెడతానంటూ తన మంచి మనసుని చాటుకున్నాడు. ప్రస్తుతం పంచ్‌ ప్రసాద్‌ దగ్గర రూపాయి లేదు. చివరికి అద్దె కట్టేందుకు కూడా డబ్బుల్లేవు. అతడి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. ఇక ఆయనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ప్రసాద్ చాలా మంచివాడు, అతడిని నేను ఆదుకుంటా వచ్చే నెల మణికొండలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్‌ ఓపెన్‌ చేస్తున్నా అంటూ ఆ వచ్చినదాంట్లో అతడికి అవసరమయ్యేదానికంటే పదివేలు ఎక్కువే ఇస్తాను అని చెప్పుకొచ్చాడు..

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కు 15 లక్షలైనా సరే చెల్లించి కాపాడుకుంటా ప్రసాద్ పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యేవరకు ఆర్థికంగా అండగా నిలబడతా’ అని చెప్పుకొచ్చాడు. ఇప్పడు ప్రసాద్ బయటికి కనిపించేంత సంతోషముగా లేడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చేపల పులుసు ఇచ్చాను, అతని ఆపరేషన్ కి సహాయం చేయాలనుకుంటున్నాను, అతనికి ఇప్పుడు చాలా అవసరం ఉంది.. అందుకే ఇలా అంటూ ఆర్పీ చెప్పాడు.దానితో ఆర్పీని లైక్ చెయ్యని వారు కూడా ఆర్పీ అన్నా నువ్ సూపర్ అన్నా.. నువ్వు కష్టం విలువ తెలిసినవాడివి కాబట్టి అలా మాట్లాడుతున్నావ్ అంటూ ఆర్పీని ఆకాశానికెత్తేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *