
నిజంగానే సతీసహగమనం అంటే ఇదే కావచ్చు. అయితే ఉత్తమ ఇల్లాలు భర్త మరణించి నెల రోజులు అవ్వకముందే ఆయన్ని చేరుకుంది..కళాతపస్వీ కే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి నేడు కన్నుమూశారు. సమాచారం ప్రకారం చాలా కాలంగా జయలక్ష్మి మంచానికి పరిమితమయ్యారు.ఆమె వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
వాటికి తోడు భర్త దూరమైన మానసిక వేదన కూడా ఎక్కువ కావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. కళాతపస్వీ కె.విశ్వనాథ్ ,భార్య జయలక్ష్మి (88)కన్నుమూశారు. ఆమె ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. జయలక్ష్మీ గారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటం తో ఆమెను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
ఆమె నిన్న సాయంత్రం చికిత్స పొందుతూ నిద్రలోనే కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ నెల రెండో తేదిన కళాతపస్వీ కె.విశ్వనాథ్ కన్ను మూసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమాయనికే జయలక్ష్మి మంచానికే పరిమితమై ఉన్నారు. అయితే కాశీనాధుని జయలక్ష్మి వయసు ప్రస్తుత 88 సంవత్సరాలు.
కే విశ్వనాథ్ తో ఆమెకు 15 ఏళ్ల వయసున్నప్పుడే వివాహం జరిగింది. కళాతపస్వి కె విశ్వనాథ్ మరణించినప్పటి నుండి ఆయన మీద ఉన్న ప్రేమతో ఆమె మంచానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఈ గొప్ప దంపతులకు ముగ్గురు సంతానం. అమ్మాయి పద్మావతి దేవి, అబ్బాయిలు కాశీనాథుని నాగేంద్రనాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్.