
Jabardasth Chalaki Chanti: చలాకీ చంటీ పలు సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించి ఈయన జబర్దస్త్ కామిడీ షో ద్వారా ద్వారా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. చలాకీ చంటీ సుదీర్ఘ కాలం పాటు జబర్దస్త్ లో కొనసాగిన కొన్ని కారణాల వల్ల మధ్యలో కొన్నాళ్లు వెళ్లి పోయాడు. మళ్ళీ తిరిగి ఎంట్రీ దక్కించుకున్నాడు.అయితే వెళ్లి పోయి తిరిగి వచ్చిన కంటెస్టెంట్స్ జబర్దస్త్ లో తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో చలాకీ చంటీ ఒకడు.
ఈటీవీలో వచ్చే జబర్దస్త్(jabardasth) కామెడీ షో ద్వారా పాపులర్ ఐన చంటీ కి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. చలాకీ చంటీ (Jabardasth Chalaki Chanti) గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురవడం తో ఫ్యామిలీ మెంబర్స్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే చంటికి డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఆయన ఆరోగ్యం విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
జబర్దస్త్ కమెడియన్ చంటికి గుండెపోటు వచ్చినట్లు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చలాకీ చంటీ ని హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. చలాకీ చంటీ(Jabardasth Chalaki Chanti) కొన్ని రోజులుగా ఆయన అటు సినిమాలు, ఇటు బుల్లితెర షోలలో కనిపించడం లేదు.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD