కొడుకు తొలి సెంచరీ పై సచిన్ టెండూల్కర్ స్పందన ఎంటో తెలుసా?

క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తెలియని వారు ఉండరు ఇక అతని కొడుకు అంటే ఇక అందరికీ సుపరిచితుడే . సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ తన కెరీర్ లో ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లోనే తండ్రి మాదిరిగానే సెంచరీ బాదాడు. అయితే రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అర్జున్ సెంచరీ చేసిన తర్వాత ఈ జూనియర్ టెండూల్కర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రంజీ సీజన్‌లో గోవాకు అర్జున్‌ టెండూల్కర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ నేపధ్యంలో రాజస్తాన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో అర్జున్‌ అద్భుతమైన సెంచరీ సాధించాడు. అర్జున్ తొలి ఇన్నింగ్స్‌లో 207 బంతులు ఎదుర్కొన్న అర్జున్‌ 120 పరుగులు చేశాడు.

అర్జున్ సెంచరీ చేయడం పై సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇన్ఫోసిస్ స్థాపించి 40 ఏండ్లు గడిచిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సచిన్ టెండూల్కర్ తన కొడుకు సెంచరీ చేయడంపై స్పందించాడు. ఆ కార్యక్రమంలో అడిగిన 0 ఒక ప్రశ్నకు సచిన్ ఒక తండ్రిగా ఇది చాలా కఠినమైన ప్రశ్న (కొడుకు అర్జున్ గురించి అడిగినప్పుడు) అని, ఆ సమయంలో తన తండ్రి గుర్తొచ్చాడని చెప్పుకొచ్చాడు.

అయితే క్రికెట్‌లో రాణించడం అంత సులభమైన విషయం కాదు. అర్జున్‌ టెండూల్కర్ కి కూడా ఇది చాలా కష్టమైన ప్రయాణం. ఇక అర్జున్‌ ఆట పరంగా నాకంటే ఎక్కువగా రోహన్ గవాస్కర్‌తో చాలా క్లోజ్‌గా ఉంటాడు. రంజీ మ్యాచ్‌లో అర్జున్‌ను నైట్ వాచ్‌మెన్‌గా పంపారు. అతడు 4 పరుగులతో నాటౌట్‌గా ఉన్నప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించమని నేను చెప్పాను.

అప్పుడు అర్జున్ ఎన్ని పరుగులు చేస్తే అది మాకు మంచి స్కోర్‌ అవుతుందని అడిగాడు. అప్పటికే వీళ్ళు 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి ఉన్నారు. నేను ఇలా చెప్పా 375 పరుగులు అయినా సాధిస్తే మంచి ఫైటింగ్‌ స్కోర్‌ అవుతుందని చెప్పాను. ఈ మ్యాచ్ లో అర్జున్‌ సెంచరీ సాధించడం నాకు చాలా సం‍తోషంగా ఉంది. ఎందుకంటే నా కొడుకు అర్జున్‌ అందరు పిల్లల్లాగా సాధారణ బాల్యాన్ని గడపలేదు.

అర్జున్ ఒక ప్రముఖ క్రికెటర్‌ కొడుకు కావడంతో అతడిపై తీవ్రమైన ఒత్తడి ఉంటుంది.నా పదవి విరమణ అయిన సమయంలో ముంబైలో మీడియా సమావేశంలో కూడా అదే చెప్పాను. అర్జున్ పై అనవసర ఒత్తిడి పెంచవద్దు, ముందు అర్జున్‌ క్రికెట్‌పై మక్కువను పెంచుకోనివ్వండి అని చెప్పాను. అర్జున్ ఒక మంచి క్రికెటర్‌గా ఎదిగితే మీకు నచ్చిన ప్రకటనలను చేయవచ్చు అని కూడా నేను అన్నాను” అని ఈ సమావేశం లో సచిన్‌ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *