
బుల్లితెరపై బాగా పాపులర్ అయినా షోలలో “జబర్దస్త్ కామెడీ షో”ముందు వరసలో ఉంటుంది.అయితే కామెడీ షోలకు జబర్దస్త్ కొత్త నాంది పలికింది. జబర్దస్త్ మొదట ఒక షోగా ప్రారంభమైన.. ఆ తర్వాత రెండుగా మారింది.షో వీక్షకుల నుంచి వస్తున్న భారీ ఆదరణ, కమెడియన్ల సంఖ్య పెరగడంతో జబర్దాస్ట్, ఎక్స్ట్రా జబర్దస్త్ గా వారంలో రెండో రోజులు బుల్లితెర ప్రేక్షకులను అద్భుతంగా అలరించేవారు.
అయితే ఈ షోకు ఒకప్పుడు రెండు కళ్లలా నాగబాబు, రోజా ఉండేవారు. ప్రస్తుతం జబర్దస్త్ జడ్జిగా కొనసాగుతున్న నటి ఇంద్రజ ఇప్పుడు బుల్లితెర లో బాగా బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇంద్రజ సుమారుగా పదేళ్ల నుండి విరామం లేకుండా ఈటీవీ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ కామెడీ షోకి జడ్జీ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ, ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
అయితే ఈ కామెడీ షో కి జడ్జిగా కొనసాగుతున్న ఇంద్రజకి ఒక్కో ఎపిసోడ్ కు 2.5 లక్షలు ఇస్తున్నారట.ఇక కమెడియన్ కృష్ణ భగవాన్ కి కూడా ఒక్కో ఎపిసోడ్ కు 2.5 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.వీరికంటే ముందు చేసిన రోజా కి మాత్రం ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా 5 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. హీరో నాగబాబు కూడా 3 లక్షల రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చారట.