
నటి ఇంద్రజ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రి లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. హీరోయిన్ ఇంద్రజ కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగిన ఈమె దాదాపు 80 కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈమె కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబంలో జన్మించింది.ఈమె ఒక సింగర్ కూడా, ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. .నటి ఇంద్రజ “చిన్ని చిన్ని ఆశ’ ‘ సొగసు చూడతరమా’ ‘యమలీల’ ‘పెద్దన్నయ్య’ ‘ఒక చిన్నమాట’ వంటి చిత్రాల్లో నటించి ఇండస్ట్రి లో మంచి పేరు తెచ్చుకుంది.
నటి ఇంద్రజ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే ఈటీవి కామెడీ షో జబర్దస్త్ జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. అయితే ఈమె ఓ షో లో తన లవ్ మ్యారేజ్ గురించి తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈమె పెళ్లి ఖర్చు అప్పుడు రూ.7500 అని చెప్పుకొచ్చింది..ఈమె పెళ్ళికి 13 మంది పెళ్లి పెద్దలు వచ్చినట్టు ఆమె తెలియజేసింది. ఇక ఈమె భర్త పేరు.. మహ్మద్ అబ్సర్.. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది అని ఆ తర్వాత అది పెళ్లికి వరకు దారి తీసింది అని చెప్పుకొచ్చింది.
నటి ఇంద్రజ భర్త కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. ఈమె తాజాగా ప్రియమైన నీకు సినిమాలో మనసున ఉన్నది అనే పాటకు డాన్స్ పర్ఫామెన్స్ చేశారు. ఆ తరువాత గజిని సినిమాలో రహతుల రహతుల అనే పాటకు మా స్టెప్పులు వేస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారని చెప్పాలి.ఇలా ఈమె డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.