
మీనా తెలుగు తనం ఉట్టిపడే నటి.అయితే మీనా తెలుగు కుటుంబానికి చెందిన ఆమె తల్లిదండ్రులు తమిళనాడులో స్థిరపడ్డారు.హీరోయిన్ మీనా 1976 సెప్టెంబర్ 16 న దురైరాజ్ – రాజమల్లిక దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి తెలుగువ్యక్తి కాగా తల్లి కేరళకు చెందిన వారు కావడం విశేషం. హీరోయిన్ మీనా తన 6 వ ఏటనే బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ” నెంజన్గల్ ” అనే తమిళ సినిమాలో శివాజీ గణేశన్ హీరోగా, మీనా బాలనటిగా కెరీర్ మొదలు పెట్టింది. హీరోయిన్ మీనా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సిరివెన్నెల మూవీ తో పాటుగా పలు సినిమాల్లో బాలనటిగా నటించింది అందరినీ మెప్పించింది.
మీనా ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ సరసన ” నవయుగం ” అనే మూవీ తో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. ఇండస్ట్రి లో ఈమె మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది మాత్రం విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ” చంటి ” సినిమానే.. ఈ మూవీ 1992 లో వచ్చిన దక్షిణ భారత దేశ చలన చిత్ర రికార్డులను అన్నింటినీ బద్దలుకొట్టి కొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పవచ్చు. ఆ ఒక్క సినిమా తో మీనా హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అందుకుంది. ఇక సినిమా హిట్ ఆ తర్వాత మీనా ఇండస్ట్రి లో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
అయితే గతేడాది మీనా భర్త విద్యాసాగర్ చనిపోయాడు. మీనా భర్త మరణంతో మీనా డిప్రెషన్ లోకి వెళ్లింది. ఈ మధ్యే ఆ చేదు సంఘటన నుంచి బయటకు వస్తుంది. హీరోయిన్ మీనా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా మారిపోయింది. ఇది ఇలా ఉండగా ఈమె ఓ బాలీవుడ్ హీరోను చాలా ఇష్టపడినట్లు తాజాగా ఒక ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందు ఆమెకు హృతిక్‌రోషన్ మీద క్రష్ ఉండేదని, అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని వాళ్ల అమ్మతో చెప్పినట్లు ఇంటర్వూలో వెల్లడించింది. అదేకాకుండా హృతిక్ పెళ్ళి రోజున తన మనసు విరిగిపోయిందని చెప్పుకొచ్చింది.