
తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలలో ఎన్నో మూవీస్ చేసి ఒకేసారి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అబ్బాస్. అబ్బాస్ ఎంత స్పీడ్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారో అంతే త్వరగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే హీరో అబ్బాస్ సినీ కెరియర్ లో ప్రేమదేశం సిన్మా ఆయనకు ఎంతో క్రేజ్ తీసుకువచ్చింది.

అప్పట్లో హీరో అబ్బాస్ లవర్ బాయ్ గా పేరుపొందారు. ఇంకా చెప్పాలి అంటే ఆయన అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండేవారు. హీరో అబ్బాస్ తెలుగులో కూడా రాజా, కృష్ణబాబు, ప్రియా ఓ ప్రియా వంటి మూవీస్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. . ఆయన కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించాడు. టాలీవుడ్ హీరో నితిన్ నటించిన ‘మారో’ మూవీ కూడా ఒకటి.

అయితే హీరో అబ్బాస్ కొన్నాళ్లుగా విదేశాల్లో ఉంటూ మోటివేషనల్ క్లాసెస్ చెప్పే జాబ్ చేస్తున్నాడు. అబ్బాస్ సినిమాల్లో కనిపించడం లేదని ఇక భవిష్యత్తులో కనిపించే అవకాశమే లేదని కూడా చెప్పేశాడు. ఆయన ఇండస్ట్రి కి దూరం అవ్వడం తో అబ్బాస్ ఫ్యామిలీ గురించి జనాలకు పెద్దగా తెలీదు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం సోషల్ మీడియాలో అబ్బాస్ కూతురు ఎమిరా అలీ ఫోటోలు వైరల్ మారాయి.

హీరో అబ్బాస్ ఎంత అందంగా హ్యాండ్సమ్ గా ఉంటాడో తన పిల్లలు కూడా అంతకంటే అందంగా ఉన్నారు. ఎమిరా అలీ హీరోయిన్ కి మించిన అందం ఆమె సొంతం అని చూస్తే మనకి ఈసీ గా అర్థమవుతోంది. అబ్బాస్ సినిమాలకు దూరం కావడం తో అతని అభిమానులు అబ్బాస్ ను రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. కానీ అబ్బాస్ అప్పుడప్పుడు మాత్రం అభిమానులకు సోషల్ మీడియాలో తమ కుటుంబం గురించి ఫోటోలను షేర్ చేస్తూన్నారు. ప్రస్తుతం ఎమిరా అలీ ఫోటోలు వైరల్ గా మారాయి.

