
Garlic benefits of Health: వెల్లుల్లి కి మన వంటలలో ప్రత్యేక స్థానం ఉన్నది.పూర్వం రోజుల్లో వెల్లుల్లి గొప్పతనాన్ని గుర్తించి వంటలలో కచ్చితంగా వాడేవారు. మామిడి పచ్చడి కూరలలో వెల్లుల్లి కి ప్రత్యేక స్థానం ఉన్నది. ఆరోగ్యానికి చాలా మంచిది.
మనకి జలుబు లాంటి ఇన్ఫెక్షన్ లు వచ్చినప్పుడు వెల్లుల్లి తో ఆవిరి పట్టడం వల్ల , వెల్లుల్లి వాసన పీల్చడం వలన జలుబు త్వరగా తగ్గుతుంది. వెల్లుల్లి నీ పచ్చిగా కానీ, కూరలలో కానీ వాడవచ్చు.పచ్చిగా వాడటం మంచిది. అలాగే రక్త నాళాలలో కొలెస్టాల్ పెరగడం వల్ల మూసుకు పోయి బీపీ పెరుగుతుంది.
వెల్లుల్లి వాడటం వల్ల రక్త నాళాలు వ్యాకోచించి సాఫీగా రక్తం సరఫరా అవుతుంది.వెల్లుల్లి చెడు కొలెస్టాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.. మెడడు కణాలను యాక్టివెట్ చేసి మెదడు బాగా పని చేసేలా చేస్తుంది.మతిమరుపు తగ్గిస్తుంది.