
gangothri-child-artist
తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన కొన్ని సినిమాలు ఎన్నేళ్లైనా కూడా జనాలకి అలా గుర్తుండిపోతాయి. ఈ సినిమా కి ఉన్న ప్రత్యేకతలె దీనికి కారణం అని చెప్పవచ్చు. . అదేవిధంగా గంగోత్రి సినిమా కూడా గుర్తుండిపోయింది. . ఆ సినిమా గుర్తుంది పోవడానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి సినిమా ఇది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు 100వ సినిమా. ఈ సినిమా ని అశ్వనీదత్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు . బాక్స్ ఆఫీసు వద్ద గంగోత్రి సినిమా మంచి విజయమే సాధించింది.

ఈ మూవీ కి కీరవాణి అందించిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గంగోత్రి మూవీ తో అల్లు అర్జున్ హీరోగా టాలీవుడ్ కి పరిచేమ అయినారు. .అయితే ఈ మూవీ లో పిల్లలకు బాగా నచ్చే వల్లంకి పిట్ట పాట.. అలాగే అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా దాదాపు అందరికి బాగా గుర్తుంటుంది. తనే బేబీ కావ్య. ప్రస్తుతం బ్యూటీ కావ్యగా మారింది. ఈ భామ బాల నటిగా చాలా సినిమాల్లో నటించిన..

ప్రస్తుతం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఆ మధ్యే వరుసగా తెలుగు, తమిళ్ లో ఆడిషన్స్ ఇస్తూ వస్తుంది. తన చదువు పూర్తి చేసుకున్న కావ్య.. ఇప్పుడు మూవీస్ వైపు చూస్తోంది. ఇండస్ట్రి లో రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. మూవీస్ లో అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ కావ్య ఫొటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి.

ఈమె అచ్చ తెలుగు అమ్మాయి కావడంతో సినిమాల్లో ఈమెకు ప్లస్ అవుతోంది. తెలుగు ఇండస్ట్రి లో అప్పట్లో నటించిన చిన్నారి బాలనటులంతా ఇప్పుడు హీరోయిన్లుగా ఎదుగుతున్నారు.ఇలా దేవుళ్లు చిత్రంలో నటించిన చిన్నారి ‘నిత్యశెట్టి’ ఈ మధ్యే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేసి అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ పిట్టకథ మూవీ తో హీరోయిన్ గా పరిచయమైంది. ఇప్పుడు వల్లంకి పిట్ట ‘కావ్య’ కూడా ఇండస్ట్రి లో ఎంట్రీకి సిద్ధమైంది.
