వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారా? అయితే జాగ్రత్త ..!

వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారా? అయితే జాగ్రత్త ..!

వర్క్‌ ఫ్రం హోం వల్ల ప్రయోజనాలతో పాటు ఇబ్బందులూ ఉంటాయి. ఇంటి నుంచి పని చేసే క్రమంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వాటి నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది.సరైన భంగిమలో కూర్చోకపోవడం, కంప్యూటర్‌ టేబుల్‌, కుర్చీ ఎత్తుల్లో తేడాలు ఎముకలు, కండరాలకు సంబంధించిన సమస్యలు తెచ్చిపెడతాయి. కొందరు డైనింగ్‌ టేబుల్‌ మీద ల్యాప్‌టాప్‌ను ఉంచి, మరికొందరు సోఫాలో కూర్చుని వర్క్‌ చేసుకుంటారు. అయితే పని కోసం ఏ ప్రదేశాన్ని వాడినా, మధ్యలో బ్రేక్‌ తీసుకుని లేచి నిలబడుతూ, కొంత దూరం నడుస్తూ ఉండాలి. లేదంటే అదే ల్యాప్‌టాప్‌ను కిచెన్‌ కౌంటర్‌ మీదకు మార్చి కొద్దిసేపు నిలబడి వర్క్‌ చేసుకోవచ్చు. ఇలా చేస్తే నొప్పులు తలెత్తకుండా ఉంటాయి. Don’t Do this work from home-entertainmentdessert.com

Alsoread: ఈ టిప్స్ పాటిస్తే చాలు ఇక మహమ్మారి మీ శరీరంలోనే అంతం అవుతుంది | Dr. Shilpi Reddy |

Don't Do this work from home

వర్క్‌ ఫ్రం హోంలో భాగంగా కంప్యూటర్‌ స్ర్కీన్ల ముందే ఎక్కువగా గడుపుతాం. కాబట్టి విజువల్‌ బ్రేక్స్‌ తగ్గిపోతాయి. జూమ్‌లో మీటింగ్స్‌ మొదలు, ఇమెయిల్స్‌ చెక్‌ చేసుకోవడం, కంప్యూటర్‌ ముందే భోజనం ముగించడం వరకూ ఎక్కువ సమయం కంప్యూటర్‌ స్క్రీన్ కే కళ్లప్పగిస్తుంటాం. ఫలితంగా కళ్లు అలసటకు లోనవుతాయి. ఈ ఇబ్బంది తలెత్తకుండా ఉండాలంటే కంప్యూటర్‌ వెలుగు కళ్లలోకి నేరుగా ప్రసరించకుండా, కంప్యూటరు స్క్రీన్ ను కళ్లకు సమాంతరంగా కాకుండా 15 నుంచి 20 డిగ్రీల మేరకు కిందకు వంచి పని చేసుకోవాలి. Don’t Do this work from home-entertainmentdessert.com

Alsoread: అసలు చూస్తే తట్టుకోలేరు భయ్యా..!పూజాహెగ్ధే పరువాల విందు.

Don't Do this work from home

కంప్యూటర్‌ స్ర్కీన్ల నుంచి వెలువడే నీలి రంగు కళ్లను పొడిబారేలా చేస్తుంది. కళ్లు అలసటకు కూడా గురవుతాయి. ఈ ఇబ్బంది తొలగాలంటే యాంటీ గ్లేర్‌ కళ్లజోడు పెట్టుకోవాలి. అలాగే కళ్లను తరచుగా ఆర్పుతూ ఉండాలి. వర్క్‌ మధ్యలో బ్రేక్స్‌ తీసుకోవాలి.అవసరాన్ని బట్టి కంటి వైద్యులు సూచించే ఐ డ్రాప్స్‌ కూడా వాడుకోవచ్చు.

Alsoread: వీర్యకణాలు సహజంగా పెరిగే అద్భుత చిట్కా.

Share
%d bloggers like this: