
Santhosh Soban: లక్ష్మీపతి గోదారి యాస, తనదైన శైలి మాటకారితనంతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . లక్ష్మీపతి రైటర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టి.. ఆయన తర్వాత పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించారు ఈయన. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. లక్ష్మీపతి కమెడియన్‌గా దాదాపు 50కిపైగా చిత్రాల్లో నటించారు. తెలుగు చిత్ర దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘అల్లరి’ చిత్రం లక్ష్మీపతికి మంచి బ్రేక్ తెచ్చిపెట్టింది.
లక్ష్మీపతి తమ్ముడు డైరెక్టర్‌గా వ్యవహరించిన ‘బాబీ’ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్లో నటించారు. అయితే లక్ష్మీపతి ఓ డైరెక్టర్‌కి అన్న అవుతాడని మీకు తెలుసా.?హీరో ప్రభాస్ నటించిన ‘వర్షం’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ శోభన్ కి లక్ష్మీపతి తమ్ముడు. ఇప్పుడు శోభన్ కొడుకు సంతోష్ శోభన్ ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించాడు. డైరెక్టర్,కమెడియన్ లక్ష్మిపతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
అయితే లక్ష్మీపతి తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుబ్బా నవ్వించారు. ఆయన లేట్ వయసు లో చిత్ర పరిశ్రమ లోకి వచ్చిన కూడా దాదాపు 50కిపైగా చిత్రాల్లో నటించారు. అయితే లక్ష్మీపతికి శ్వేతా, కేతన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే ఆయన తమ్ముడు కొడుకైన సంతోష్ శోభన్ ప్రస్తుతం సినిమాల్లో హీరోగా రాణిస్తున్నాడు. మొదట ‘గోల్కొండ హైస్కూల్’లో క్రికెట్ టీంకు కెప్టెన్‌గా విద్యార్ధి రోల్లో మెప్పించాడు సంతోష్ శోభన్.
ఇక సంతోష్ శోభన్ విషయానికొస్తే ‘పేపర్ బాయ్’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత ‘అన్నీ మంచి శకునములే’ అనే సినిమాతో అలరించారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటారని అందరూ అనుకుంటున్నారు. ఈ సందర్భంగా సంతోష్ శోభన్, తన పెద్ద నాన్న లక్ష్మీపతితో కలిసి సోషల్ మీడియాలో పిక్స్ పెట్టి అలరిస్తున్నారు. పెద్ద నాన్న లాగే సంతోష్ శోభన్ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు.