
Manobala: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అందరిని కలవరపెడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఇళయరాజా సోదరుడి కుమారుడు పావలర్ శివన్ గుండెపోటుతో మరణించగా ప్రస్తుతం ప్రముఖ కమెడియన్ మనోబాల కూడా మరణించినట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.ఈ రోజు ఉదయం ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు.
మనోబాల కాలేయ వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని తన నివాసంలో మనోబాల కన్నుమూశారని ట్విట్టర్ వేదికగా కుమార్ తెలిపారు. మనోబాల మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కమెడియన్ మనోబాల అభిమానులు పెద్దసంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.
మనోబాల గారు సాధారణంగా ఒక్కరోజు దాదాపు 100 నుంచి 200 సిగరెట్స్ తాగుతాడాని…… దీనితో ఆయన కాలేయం దెబ్బతిందని చెప్పారు. ఇప్పటివరకు మనోబాల సంపాదించిన డబ్బంతా తన చికిత్స కోసమే ఉపయోగించారు అని టాక్. మనోబాల సిగరెట్స్ ఎక్కువగా తాగడం వల్ల చనిపోతానని తనకు ముందే ..
వైద్యులు చెప్పారని గతంలో తెలిపారు. జనవరిలో తీవ్ర అనారోగ్యానికి గురైన మనోబాల అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కొడుకు ఉన్నారు. మనోభాల మరణ వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.