పెళ్లి తరువాత ఈ స్కీమ్ లో చేరండి. ఖచ్చితమైన నెలవారి రాబడిని పొందండి.

పెళ్లి తరువాత ఈ స్కీమ్ లో చేరండి. ఖచ్చితమైన నెలవారి రాబడిని పొందండి.

పెళ్లి తరువాత అందరికీ ఖర్చులు పెరిగి అవసరాలు పెరుగుతాయి. దీనితో కష్టపడి సంపాదించిన డబ్బులు సురక్షితమైన పెట్టుబడులలో పెట్టడం వల్ల భద్రంగా ఉంటాయి. కొన్ని సార్లు హామీతో కూడిన రాబడిని కూడా పొందవచ్చు. అయితే కోవాకి చెందిన పోస్ట్ ఆఫీస్ అందించే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ బాగుంటుంది. ఈ స్కీమ్ లో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే హామితో కూడిన రాబడిని నెల నెల పొందవచ్చు. అయితే ఈ ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. మొత్తానికి ఐదేళ్ల తర్వాత మీరు నెలవారీ ఆదాయాన్ని పొందడం ప్రారంభిస్తారు.

ఈ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.ఈ స్కీమ్ లో ఉమ్మడి ఖాతా గరిష్టంగా 9 లక్షల పెట్టుబడి పెట్టవచ్చు. అయితే పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో సింగిల్ లేదా జాయింట్ ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు.ఈ ఖాతా ను కనీస పెట్టుబడి రూ.1,000 తో తెరవవచ్చు. ఒకే ఖాతాలో గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు మరియు ఈ సమయంలో ఉమ్మడి ఖాతాలో రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు.

MIS ప్రయోజనాలు తెలుసుకుందాం:

ఈ పోస్టాఫీసు MIS పథకంలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. అయితే ఈ ఖాతాపై వచ్చే ఆదాయం ప్రతి సభ్యునికి సమానంగా చెల్లిస్తారు.మళ్ళీ మీరు ఉమ్మడి ఖాతా ను ఎప్పుడైనా ఒకే ఖాతాగా మార్చవచ్చు. అదేవిధంగా ఒకే ఖాతాను ఉమ్మడి ఖాతాగా మార్చుకోవచ్చు. ఈ ఖాతాలో ఏవైనా మార్పులు చేయాలంటే ఖాతా సభ్యులందరు ఉమ్మడిగా ఒక దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ అంటే ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ ఖాతాని మరో 5-5 సంవత్సరాలకు పొడిగించవచ్చు.

ఇక వడ్డీ వివరాలు ఇలా ఉన్నాయి. పోస్టు ఆఫీసు అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం నెలవారీ ఆదాయ పథకంలో సంవత్సరానికి 6.6% వడ్డీని చెల్లిస్తున్నారు. దీనిలో భారతీయ పౌరులు ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వేళ మీరు ఇందులో డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మాత్రమే మీరు ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ పథకం నిబంధనల ప్రకారం మీరు ముందుగా డబ్బును విత్డ్రా చేయవలసి వస్తే ‘ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మధ్య డబ్బును విత్‌డ్రా చేస్తే మీరు చేసీన డిపాజిట్ మొత్తంలో 2 శాతం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ ఖాతా తెరిచిన 3 సంవత్సరాల పూర్తి అయిన తర్వాత మెచ్యూరిటీకి ముందు డబ్బును విత్‌డ్రా చేస్తే మీరు మొత్తం డిపాజిట్‌లో 1 శాతం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

Share
పెద్దనాన్న కోసం హీరో ప్రభాస్ కీలక నిర్ణయం.. ప్రభాస్ కన్నీరు.. చూస్తూ తట్టుకోలేకపోతున్న అభిమానులు. బిగ్ బాస్ లో ఫైమా పారితోషికం ఎంతో తెలుసా? జల్సా రీ రిలీస్ కలెక్షన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.