
Brahmanandam: ఒక స్టార్ హీరో తెర పై కనిపిస్తే విజిల్స్ పడతాయి అనే విషయం అందరికీ తెలిసిందే.కానీ ఒక కమెడియన్ ఎంట్రీ ఇచ్చినా సరే విజిల్స్ పడుతున్నాయి అంటే.. ఈ అద్భుతం ఒకే ఒక్క కమేడియన్ బ్రహ్మానందం గారికే చెల్లుతుంది అని చెప్పవచ్చు.. బ్రహ్మానందం తెర పైన జస్ట్ అలా కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లిపోతుంటాయి. బ్రహ్మానందం కామెడీ టైమింగ్ జనాల్లో అలా చెరగని ముద్ర వేసుకుంది. అభిమానులు ఈయన్ని హాస్య బ్రహ్మ అంటుంటారు. అయితే హాస్య బ్రహ్మ కొద్దిరోజుల క్రితం ఈయన హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న కారణంగా మూవీస్ దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఈయన తెరపై కనిపిస్తే ముఖంపై నవ్వు వస్తుంది. ఆయన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ స్టార్ కమెడియన్ అయ్యాడు. హాస్యనటుడు బ్రహ్మానందం వ్యక్తిగత జీవితానికి విషయానికి వస్తే 1956 ఫిబ్రవరి 1న కన్నెగంటి నాగలింగాచార్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు 7వ సంతానంగా ఆంధ్ర రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం చాగంటి వారిపాలెంలో ఈయన జన్మించారు.ఇప్పుడు ఈయనకు 67 సంవత్సరాలు.బ్రహ్మానందం ను…. మెగాస్టార్ చిరంజీవి ఎంకరేజ్ చేయడంతో ఎన్నో సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు గడించారు.
అయితే 10 ఏళ్ళ క్రితమే వరకూ ఆయన నటించే సినిమాల్లో హీరోయిన్ల కంటే ఎక్కువ పారితోషికం అందుకునే వారు అనడంలో అతిశయోక్తి లేదు. హాస్య బ్రహ్మ సంపాదన ఎంత వరకూ ఉంటుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉండే ఉంటుంది. ఇక మొదటి నుండీ బ్రహ్మానందం గారు మూవీస్ ద్వారా సంపాదించిన డబ్బుని రియల్ ఎస్టేట్లాంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేశారట. అయితే ఇప్పటికీ వాటి విలువ రూ.400కోట్ల నుండీ రూ.450 కోట్ల వరకూ ఉంటుందని అంచనా గా తెలుస్తుంది. ఇప్పుడు బ్రహ్మానందం కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రంగమార్తాండ’ చిత్రంలో నటిస్తున్నారు.