
బుల్లితెర యాంకర్ గా చేస్తూ అభిమానులను సంపాదించుకున్న లాస్య అందరికీ తెలిసిన నటి. ఈమే బుల్లితెర షోస్ లో యాంకర్ గా , బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ చేసి అందరికీ సుపరిచితురాలు. అయితే ఆమె అభిమానులకు ఒక గుడ్ చెప్పింది లాస్య. యాంకర్ లాస్య మరోసారి తల్లి అయ్యారు. ఆమె పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చారు. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమే స్వయంగా తెలిపారు.
సోషల్ మీడియాలో ‘ఇట్స్ ఏ బేబీ బోయ్’ అని ఆమె పోస్ట్ చేశారు. ఈమె ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు.. యాంకర్ లాస్య బేబీ బంప్ ఫొటోలు, సీమంతం ఫొటోలను కూడా ఇంతకు ముందే అందరితో పంచుకున్నారు. మరోసారి తల్లి అయిన లాస్యకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.యాంకర్ లాస్యకు తొలిసారి కూడా కొడుకే పుట్టాడు. ఈ మధ్యే రెండోసారి గల్బం దాల్చిన లాస్య వీడియో షేర్ చేస్తూ అభిమానులకు, బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త చెప్పింది.
ఇంతలోనే మళ్ళీ ఒక శుభవార్త తాజాగా లాస్య ఇప్పుడు మరోసారి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె స్వయంగా తెలియజేయడం జరిగింది. ఇట్స్ ఏ బేబీ బాయ్ అని పోస్ట్ చేసింది. దీనితో ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. బుల్లితెర యాంకర్ లాస్యకు మొదటిసారి కూడా కొడుకే పుట్టారు. అతడిని ముద్దుగా జున్ను అని పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు లాస్య షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.