
Akkineni akhil: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నట వారసులు సందడి చేస్తోన్నారు. వారిలో కొందరు మాత్రమే ఆరంభంలోనే సక్సెస్ అయ్యారు. ఇండస్ట్రిలో మరికొందరు మాత్రం చాలా కాలం పాటు కష్టపడాల్సి వచ్చింది. వారిలో అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ ఒకడు. హీరోగా ఇండస్ట్రి కి పరిచయం అయ్యాక చాలా కాలం తరువాత విజయన్ని అందుకున్నాడు. అయితే ఈ హీరో మంచి జోష్‌లో ఉన్నాడు.
అదే ఉత్సాహంతోనే త్వరలోనే ‘ఏజెంట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అఖిల్ ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని న్యూస్ వైరల్ అవుతోంది. అసలు కథ ఎంతో చూద్దాం. అయితే తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు, హీరో అక్కినేని అఖిల పై సంచలన ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ మూవీలో ఐటెం సాంగ్ చేసిన ఊర్వశీ రౌటేలాను వేధించాడని ఈ సంఘటన యూరప్‌లో జరిగిన షూటింగ్లో జరిగినది అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ విషయాన్ని బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్లో ఊర్వశీ రౌటేలా కొన్ని విషయాలను స్వయంగా తానే చెప్పినట్లు కూడా పేర్కొన్నాడు. ‘అక్కినేని అఖిల్ పరిపక్వత లేని నటుడు. అతడితో పని చేయడం చాలా అసౌకర్యంగా అనిపించింది అని ఆమె వ్యక్తం చేసింది అని ట్వీట్లో వివరించాడు. దీనితో ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది.
