
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్వర్గీయ డైరెక్టర్ ఈ.వీ.వీ సత్యనారాయణ 2004వ సంవత్సరంలో తెరకెక్కించిన “ఆరుగురు ప్రతివ్రతలు” అనే మూవీ సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే అలరిస్తుంది.. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ సినీ ప్రేక్షకులను బాగానే అలరిస్తుంటాయి.
ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు వస్తుంటారు, వెళ్తుంటారు.
అయితే వీరిలో తక్కువ మంది మాత్రమే క్లిక్ అవుతారు.. మరికొంతమంది మాత్రమే ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. తెలుగు ఇండస్ట్రి లో ఈవీవీ సత్యనారాయణ అంటే ఓ బ్రాండ్ ఉంది. ఈయన కామెడీ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.. అలాంటి ఈవీవీ సత్యనారాయణ ఎవ్వరూ ఉంచని మూవీ చేసి షాక్ ఇచ్చారు. ఆ సినిమానే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఆరుగురు పతివ్రతలు.
అప్పట్లో ఈ మూవీ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమా లో మెయిన్ రోల్ పోషించిన నటి అమృత. ఈమె కన్నడ సినీ పరిశ్రమకు చెందిననటి. ఈమెను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ రావు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నటి అమృత 2004 లో వచ్చిన ఆరుగురు పతివ్రతలు మూవీ లో కాస్త బోల్డ్ సన్నివేశాలలో నటించింది.
ఈ మూవీ లో ఈమె ఒకవైపు మొగుడు ఒకవైపు లవర్ మధ్య నలిగిపోయిన పాత్రలో తన అద్భుత నటనతో ఆకట్టుకుంది. నటి అమృత 2009లో జోడి నెంబర్ వన్ అనే కన్నడ చిత్రం చివరి సినిమా. కాగా ఆమె కెరియర్లో కేవలం ఎనిమిది మూవీ మాత్రమే చేసింది. ఇప్పుడు వెండితెరకు దూరమైన అమృత వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారట. నటి అమృత సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో ఆమె ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అన్న విషయంపై ఎప్పుడు నెటిజన్స్ గూగుల్లో గాలిస్తూనే ఉంటారు.