మనల్ని కరోనా నుంచి కాపాడుతున్న ఆయుధాలు ఇవే.

మనల్ని కరోనా నుంచి కాపాడుతున్న ఆయుధాలు ఇవే.

ప్రస్తుతం కరోనా నుంచి కాపాడుతున్న ఆయుధాలివే.కరోనా వైరస్ కు దూరంగా ఉండాలంటే మాస్క్, సోషల్ డిస్టెన్స్ శ్రీరామరక్ష. చికిత్స కన్నా నివారణ మేలు.. అన్న మాట సరిగ్గా సరిపోతుంది. మందు లేని మాయదారి రోగానికి మనం పాటించే జాగ్రత్తలే రక్షణగా నిలుస్తాయి. పని అత్యవసరం కానిదే బయటకు వెళ్లకపోవడం, ముఖ్యంగా మాస్క్ ధరించడం, మరి ముఖ్యంగా 6 అడుగుల భౌతిక దూరం పాటించడం..అన్ని సరే కానీ 6 అడుగుల భౌతిక దూరం కరోనాను నిలువరించలేదని సైంటిస్టులు పెద్ద బాంబు పేల్చారు. These things protect from corona-entertainmentdessert.com

Alsoread: ఈ టిప్స్ పాటిస్తే చాలు ఇక మహమ్మారి మీ శరీరంలోనే అంతం అవుతుంది | Dr. Shilpi Reddy |

These things protect from corona

ప్రతి ఇద్దరి వ్యక్తుల మధ్య సోషల్ డిస్టెన్స్ ఎంత ఉండాలి? అసలు సోషల్ డిస్టెన్స్ తో కరోనాకు చెక్ పెట్టవచ్చా? యూఎస్ లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్ ఏం చెబుతుంది.గతంలో ఇద్దరు వ్యక్తుల మధ్య 6 అడుగుల దూరం ఉన్నప్పుడు ఇద్దరూ మాస్కులు ధరిస్తే వైరస్ వ్యాపించే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే వైరస్ సోకిన వ్యక్తి 30 రోజుల్లో 406 మందిని కరోనా ఖాతాలో చేర్చడం ఖాయమని శాస్త్రవేత్తలు అంటున్నారు. సోషల్ డిస్టెన్స్ 70 శాతం పాటిస్తే కరోనా బాధితుడు ద్వారా 30 రోజుల్లో కేవలం ముగ్గురికి మాత్రమే వైరస్ సోకినట్లు గుర్తించబడింది. These things protect from corona-entertainmentdessert.com

Alsoread: అతిగా శానిటైజర్‌ వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?అసలు ఎప్పుడు వాడాలో తెలుసుకుందాం.

These things protect from corona

మనిషి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, కొన్నిసార్లు మనిషి సాధారణంగా మాట్లాడిన సమయంలోనూ నోటి నుంచి దాదాపు వేల తుంపరులు సెకన్ కు దాదాపు వంద మీటర్ల వ్యాప్తి చెందుతాయి. సూక్ష్మకణాలు వైరస్ ను ఎక్కువ దూరం మోసుకెళ్లే సామర్థ్యం ఉండటంతో కొన్ని గంటలపాటు గాలిలోనే ఉండగలవనే విషయాన్ని సీడీసీ వెల్లడించింది.చల్లని వాతావరణంలో వైరస్ కణాలు 6 అడుగులే కాకుండా 6 మీటర్లు వరకు వ్యాపిస్తాయట. ఇంటి బయటే కాదు, ఇంటి లోపల కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని సీడీసీ చెబుతోంది.

Alsoread: కలలో పాము కనిపిస్తే దేనికి సంకేతం.? What Does it Mean When You Dream About Snakes.?

Share
%d bloggers like this: